బాలకృష్ణ కష్టాలు

తమ తప్పు లేకున్నా తంటాలు పడుతోంది డిక్టేటర్ యూనిట్.సినిమా దాదాపు పూర్తి అయిపోగా, బిజినెస్ మొదలుపెడదామంటే, చెప్పిన రేట్స్ కి కొనడానికి ముందుకు రావాట్లేదు బయ్యర్స్.

 Kona Factor Effects Dictator-TeluguStop.com

దానికి కారణం బాలకృష్ణ చివరి సినిమా సరిగా ఆడకపోవడం కాదు, దర్శకుడు శ్రీవాస్ అంతకన్నా కాదు.మరి ఎవరు?

స్టార్ రైటర్ కోన వెంకట్ వలన డిక్టేటర్ కు కష్టకాలం వచ్చిపడింది.అవును, కోన మూలాన డిక్టేటర్ బిజినెస్ లో ఊపు లేదు.బాలకృష్ణ డిక్టేటర్ కి రచయిత కోనానే.బ్రూస్ లీ, అఖిల్, శంకరాభరణం చిత్రాలతో వరుస ఫ్లాపులు అందుకున్నాడు కోన.అదీ కాకుండా, అందరిని వదిలేసి ఈ సినిమాలన్నిటికి తానొక్కడే కారణమైనట్టు అంతా కోనా మీదే పడుతున్నారు.ట్రేడ్ వర్గాల్లో కోన మీద బ్యాడ్ ఇంప్రెషన్‌ వచ్చేసింది.

ఒక ఏరియా డిస్ట్రిబ్యూటర్ డిక్టేటర్ నిర్మాతలతో ” మీరేమో సింహా, లెజెండ్ రేంజ్ చెప్పి, ఆ ఊహల్లోనే రేట్లు చెబుతున్నారు, కాని అవతల ఉన్నది కోన వెంకట్ ” అని మొహమాటం లేకుండా అనేసాడంట.

అవాక్కవడం నిర్మాతల వంతైంది.దాంతో 40 కోట్లకు పైగా అవుతుంది అనుకున్న డిక్టేటర్ బిజినెస్ 30-33 కోట్లకె ముగిసేలా ఉంది.ఫామ్ లో ఉండీ కుడా బాలయ్య బాబుకి ఏంటో ఈ కష్టాలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube