కోన వెంకట్ టైమ్ అస్సలు బాగాలేదు

ఒక్క సంవత్సరంలో ఎంత మార్పు ! గత ఏడాది కోన ఆడిందే ఆట , పాడిందే పాట.అసలు అంచనాలు లేని గీతాంజలి హిట్ అయిపొయింది.

 Kona In His Worst Phase-TeluguStop.com

రొటీన్ సినిమా అనుకున్న లౌక్యం పెద్ద బ్లాక్బస్టర్ గా నిలిచింది.విమర్శలపాలైన అల్లుడు శీను కుడా సూపర్ హిట్ అనిపించుకుంది.

మరి ఈ సంవత్సరం ? సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

బ్రూస్ లీ పెద్ద పరాజయం.

అఖిల్ బయటకి చెప్పుకోలేని పరాజయం.త్రిపుర ఎప్పుడు వచ్చిందో, ఎలా వెళ్లిందో కుడా జనాలకి గుర్తు లేదు.

ఇప్పుడు కొత్తగా శంకరాభరణం.ఈ రోజే విడుదలైన శంకరాభరణం టాక్ ఆశాజనకంగా లేదు.

కొందరు యావరేజ్ అంటున్నారు, కొందరు సినిమా లో అసలు విషయమే లేదని చెబుతున్నారు.ఈ సినిమా హిట్ అయితే అది అద్భుతమే అంటున్నారు ట్రేడ్ పండితులు.

మూస పద్ధతిలో కొట్టుకుపోతున్నాడని విమర్శలు వస్తున్నా, తన పధ్ధతి మార్చుకోవట్లేదు కోన వెంకట్.

ప్రొఫెషనల్ గా ఇన్ని ఉంటె, శ్రీను వైట్ల తో గొడవలు, వైట్ల కేసు వేస్తున్నాడనే బెదిరింపులు, కోన వరుస పరాజయాలను అడ్డం పెట్టుకొని, ట్విట్టర్ లో అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలు.

ఇలా అస్తవ్యస్తంగా తయారయ్యింది కోన వెంకట్ పరిస్థితి.మరి టైం బాగాలేదని కోన సర్దుకుపోతాడా లేక మునుపటి వైభవాన్ని సంతరించుకునేందుకు తన శక్తంతా ధారబోస్తాడా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube