రివ్యూయర్లు ఆ మాట మాత్రం వాడకండి..!-Kollywood Actor Prabhu Request To Reviewers 3 months

Kollywood Actor Prabhu Request To Reviewers Meen Kulambu Movie Interview Review And Rating On Movies Photo,Image,Pics-

సినిమా ఎంత బడ్జెట్ తో తీసినా ఎంత ప్రమోట్ చేసినా మొదటి ఆట వచ్చే టాక్ బట్టే వసూళ్లు ఉంటాయి. ఈ క్రమంలో రివ్యూయర్లు ఇచ్చే రెటింగ్స్ కు కూడా సినిమా మీద ఓ అభిప్రాయానికి వస్తారు ఆడియెన్స్. అది ఎంత శాతం అన్నది తెలియదు కాని సినిమా చూసేప్పుడు రివ్యూ రెటింగ్ చూసి వెళ్లడం నెటిజెన్లకు అలవాటే. అయితే కొన్ని సార్లు దర్శక నిర్మాతలు రివ్యూయర్ల మీద మండి పడటం మాములే.

సినిమా రివ్యూ పాజిటివ్ గా రాస్తే ఓ రేంజ్లో పొగిడే వారు అదే రివ్యూ నెగటివ్ గా రాస్తే మాత్రం విమర్శలు కురిపిస్తారు. అయితే ఈ క్రమంలో కోలీవుడ్ నటుడు ప్రభు మీడియాతో ముచ్చటించారు. తను, తన సోదరుడి తనయుడు దుశ్యంత్ రాం కుమార్ కలిసి నిర్మిస్తున్న మీన్ కొళంబుం మణ్ పానైయం సినిమా విషయం గురించి మీడియాతో మాట్లాడిన ప్రభు. సినిమా పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలు మీడియా వారికి తెలుసని సినిమాను మనమందరం కాపాడాల్సిన భాధ్యత ఉన్నదని అన్నారు.

ఇక మీడియా సినిమాపై విరుచుకు పడటం మాములే విమర్శలు చేయండి కాని రివ్యూ రాసేప్పుడు చెత్త సినిమా లాంటి మాటలు వాడకండి అని విన్నవించుకున్నారు. మీడియాపై తనకున్న అనుబంధంతోనే తాను ఈ సూచన చేస్తున్నానే తప్ప వేరే ఆలోచనతో కాదు అని అన్నారు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శృతి హాసన్ - సమంతల మధ్య "ప్రేమ" గొడవలు ?

About This Post..రివ్యూయర్లు ఆ మాట మాత్రం వాడకండి..!

This Post provides detail information about రివ్యూయర్లు ఆ మాట మాత్రం వాడకండి..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Kollywood Actor Prabhu Request to Reviewers, Actor Prabhu, Review and Rating on Movies, meen kulambu movie, Prabhu Interview

Tagged with:Kollywood Actor Prabhu Request to Reviewers, Actor Prabhu, Review and Rating on Movies, meen kulambu movie, Prabhu InterviewActor Prabhu,Kollywood Actor Prabhu Request to Reviewers,meen kulambu movie,Prabhu Interview,Review and Rating on Movies,,