కోదండ‌రాం కొత్త పార్టీ..!

తెలంగాణ ఉద్య‌మంలో ఉవ్వెత్తున ఎగిసిన ప‌డిన మేధావి వ‌ర్గానికి నాయ‌క‌త్వం వ‌హించిన జేఏసీ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌.కొత్త పార్టీకి రెడీ అవుతున్నార‌నే టాక్ తెలంగాణ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

 Kodandaram To Launch New Political Party-TeluguStop.com

వాస్త‌వానికి పాలిటిక్స్ అంటే పెద్ద ఇష్టం ఉండ‌ద‌ని, త‌న‌కు తాను విద్యావేత్త‌గా, స‌ల‌హాదారుగా ఉండ‌డ‌మే ఇష్ట‌మ‌ని ప‌లుమార్లు చెప్పుకొన్న కోదండ‌రామ్‌.ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ప్ర‌భుత్వానికి దూరంగా ఉన్నారు.

ప్ర‌భుత్వంలోకి వ‌స్తామంటే ఆయ‌న‌ను అడ్డుకునే వారు ఎవ‌రు అంటూ గ‌తంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు దీనికి నిద‌ర్శ‌నం.

అయితే, ఇటీవ‌ల కాలంలో కోదండ‌రామ్.

త‌న స్ట్రాట‌జీ మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.మొన్న‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ పాల‌న‌పై విరుచుకుప‌డిన కోదండ రామ్‌.

ఇప్పుడు నేరుగా కేసీఆర్‌పైనే విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.ఇటీవ‌ల కేసీఆర్ నూత‌న గృహం నిర్మించుకోడాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

ఉన్న ఇంటినే మార్పులు, చేర్పులు చేసుకోవ‌చ్చుక‌దా అని విమ‌ర్శించారు.అదేస‌మ‌యంలో పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డంలో జ‌రుగుతున్న జాప్యం.

కేసీఆర్ ఇంటి విష‌యంలో మాత్రం జ‌ర‌గ‌లేద‌ని ఎద్దేవా చేశారు.

పేదలు, రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఏమాత్రం గౌరవం లేదని ఈ విధంగా ప్రజాధనాన్ని వృధా చేయడం వెల్లడి చేస్తోంద‌ని నిశితంగా విమర్శించారు.

దీనిని బ‌ట్టి చూస్తుంటే.కోదండ రామ్ ఏదో కొత్త పార్టీ పెట్టేలా ఉన్నాడ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

ఇటీవ‌ల కోదండ‌రాం ఓ ప‌త్రిక‌, వెబ్ ఛానెల్ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.దీనిని పాలిటిక్స్‌లో గ్రౌండ్ వ‌ర్క్‌గా భావించాల్సి వ‌స్తోంది.

ఇప్పుడున్న ట్రెండ్‌లో మీడియా లేక‌పోతే ఎంత పొలిటిక‌ల్ నేత‌కైనా ప్ర‌చారం క‌రువే! దీనిని దృష్టిలో పెట్టుకునే కోదండ‌రామ్ ప్రిపేర్ అవుతున్నార‌న్న‌మాట‌.దీనికితోడు వామ‌ప‌క్షాలు స‌హా ప్ర‌జ‌ల్లోని ఓ వ‌ర్గం కోదండ రామ్ వంటి మేధావులు పాలిటిక్స్‌లోకి రావాల‌ని కోరుతున్నారు.

ఇదిలావుంటే, ఈ రెండున్న‌రేళ్ల కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఒకింత అస‌హ‌నం ఉంది.ఇది కూడా కోదండ రామ్‌కి తోడ్ప‌డే ఛాన్స్ ఉంద‌ని భావిస్తున్నారు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలంటే కొన్ని నెల‌లు వేచి ఉండ‌క త‌ప్ప‌దు!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube