కేసీఆర్‌కు యాంటీగా తెలంగాణ‌లో కొత్త కూట‌మి

తెలంగాణ రాజ‌కీయాల్లో గ‌త రెండున్న‌రేళ్లుగా చూస్తే సీఎం కేసీఆర్‌ది వ‌న్ మ్యాన్ షో.ఆ షోలో ఆయ‌నే హీరో.

 Kodandaram Shock To Cm Kcr-TeluguStop.com

ఆయ‌న్ను ఎదుర్కొనే ప్ర‌తిప‌క్షాలు జీరో.అయితే ఇప్పుడు కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు ఆయ‌న‌కు యాంటీగా అన్ని పార్టీలు ఒక్క‌తాటిమీద‌కు రానున్నాయా ? అక్క‌డ ఓ కొత్త రాజ‌కీయ కూట‌మికి పునాదులు ప‌డ్డాయా.? ఇక్క‌డ రాజ‌కీయ శ‌క్తుల‌తో పాటు ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై పోరాడుతోన్న ఇత‌ర సామాజిక సంస్థ‌లూ ఈ కూట‌మిలో క‌లుస్తున్నాయా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ టీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.

ప్ర‌స్తుతానికి ఈ ప్ర‌తిపాద‌న ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉన్నా త్వ‌ర‌లోనే ఈ కూట‌మి ఏర్ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఈ కూట‌మికి టీ జేఏసీ క‌న్వీన‌ర్‌, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం నేతృత్వం వ‌హిస్తార‌ని.ఇందుకోసం ఆయ‌న‌పై కాంగ్రెస్‌, టీడీపీ తీవ్ర‌స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నాయి.వాస్త‌వానికి తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాల‌న్ని చాలా వీక్‌గా ఉన్నాయి.15 సీట్లు గెలుచుకున్న టీడీపీ ఇప్పుడు కేవ‌లం 3 సీట్ల‌కు ప‌రిమిత‌మైపోయింది.

కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కారెక్కేశారు.కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ప్ర‌తిప‌క్షాల‌ను వీక్ చేసుకుంటూ వ‌స్తున్నారు.ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌ను ఎదుర్కోవ‌డం కాంగ్రెస్ – టీడీపీ – వామ‌ప‌క్షాల‌కు విడివిడిగా సాధ్యం కావ‌డం లేదు.అందుకే ఈ పార్టీల‌న్నీ ఒకే తాటిమీద‌కు వ‌చ్చి కోదండ‌రాం నేతృత్వంలో క‌లిసి కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడేందుకు రెడీ అవుతున్నాయి.

ప్ర‌భుత్వం తీరుపై ఇప్ప‌టికే కోదండ‌రామ్ తీవ్ర నిర‌స‌న గ‌ళ‌మెత్తుతున్నారు.కోదండ‌రాం టార్గెట్‌గా టీఆర్ఎస్ నాయ‌కులు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌పై కాంగ్రెస్‌, టీడీపీ విరుచుకుప‌డుతున్నాయి.

ఇలా వీరంద‌రూ ఒకే ట్యూన్‌లో ముందుకు వెళుతున్నారు.

ఇటీవ‌ల కోదండ‌రామ్ ఓ దీక్ష చేప‌డితే రేవంత్ వెళ్లి సంఘీభావం ప్ర‌క‌టించారు.

కాంగ్రెస్ నుంచి ఉత్త‌మ్ కుమార్ క‌లిసి వ‌చ్చారు.ఈ క్ర‌మంలోనే ఈ కొత్త కూట‌మికి కోదండ‌రాం నేతృత్వం వ‌హించేలా రేవంత్‌-ఉత్త‌మ్ ఆయ‌న్ను ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరంతా క‌లిసి పోటీ చేసినా …విడివిడిగా పోటీ చేసినా అప్ప‌టి వ‌ర‌కు మాత్రం ప్ర‌భుత్వ చేప‌ట్టే ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌మీద క‌లిసికట్టుగా పోరాడాల‌ని వీరు డిసైడ్ అయ్యారు.ఇది కార్య‌రూపం దాలిస్తే తెలంగాణ రాజ‌కీయ యువ‌నిక‌పై స‌రికొత్త కూట‌మి ఏర్ప‌డిన‌ట్లే.

అయితే ఇది ఏర్ప‌డే లోపే అప‌ర రాజ‌కీచ చాణుక్యుడు అయిన కేసీఆర్ మ‌రో ఎత్తుతో వీరికి షాక్ ఇచ్చినా ఆశ్చ‌ర్యపోవాల్సిన ప‌నిలేదు!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube