కామ్రెడ్‌ అభ్యర్థిగా కోదండం సారు!

తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ముందు ప్రయత్నాలు చేసిన విషయం తెల్సిందే.అయితే కేసీఆర్‌ ప్రతిపాధనను అప్పట్లో కోదండరామ్‌ సున్నితంగా తిరస్కరించాడు.

 Kodandaram As Cpm Candidate…?-TeluguStop.com

తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఉద్యమం నడిపిన కోదండరామ్‌ రాజకీయాల్లోకి వచ్చి, తెలంగాణ పున: నిర్మాణంలో పాలు పంచుకోవాలని అంతా భావించారు.కాని రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తన ఉద్యోగంలో చేరాడు కోదండం సారు.

అయితే ఇటీవల మళ్లీ కోదండరామ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

ఇక త్వరలో తెలంగాణలో జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్‌ పోటీ చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కమ్యూనిస్టు భావాలున్న కోదండరామ్‌తో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేయించాలని ఆ పార్టీ అధ్యక్షుడు వీరభద్రం భావిస్తున్నాడు.ఇప్పటికే కోదండరామ్‌తో పలు దఫాలుగా వీరభద్రం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

అయితే కోదండరామ్‌ ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి లేదని తోసిపుచ్చుతున్నట్లుగా తెలుస్తోంది.మరి వీరభద్రం ప్రయత్నం సఫలం అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube