బరువు తగ్గాలంటే .. వంటిట్లో ఈ జాగ్రత్తలు అవసరం

సాధారణంగా బరువు ఎందుకు పెరుగుతారు? సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన.ప్రతీరోజు బయటి ఆహారం తినరు కాబట్టి, పొరపాట్లు ఎక్కువగా వంటింట్లోనే జరుగుతున్నాయి.

 Kitchen Tips For Losing Weight-TeluguStop.com

ఆ తప్పులేంటంటే …

* కొంతమంది ఒకసారి వంటలకు వాడిన నూనెను మరోసారి మరో వంటకానికి వాడుతూ ఉంటారు.ఇలా చేయడం మంచిది కాదు .ఎందుకంటే ఫ్రెష్ నూనెతో పోల్చుకుంటే, వాడిన నూనెలో ట్రాన్స్‌ ఫ్యాట్స్ ఎక్కువ.

* పొద్దున్నే అల్పాహారాన్ని కూడా ఏ పూరితోనో, దోశతోనో కాకుండా, ఆవిరితో చేసిన ఇడ్లీ తో ప్రారంభించండి.

* బరువు తగ్గాలనుకునేవారు నూనెతో చేసే వంటకాలను ఎంత తక్కువ తింటే అంత మంచిది.అయితే నూనె తక్కువగా వాడే వంటలను చేసుకోండి, లేదా అయిల్ లెస్ ఫుడ్స్ మీద దృష్టిపెట్టండి.

* ఎలాంటి నూనె వాడాలో బాగా ఆలోచించండి.లో ఫ్యాట్స్ ఉన్న మంచినూనె వాడితే మంచిది.

* రుచి కోసం నెయ్యి, బట్టర్, చీజ్ లాంటివి వాడటం బాగానే అనిపించినా, ఇవి బరువు అస్సలు తగ్గనివ్వవు.కాబట్టి వీటికి దూరంగా ఉండటమే మేలు.

* వంటల్లో ఉప్పు శాతం కూడా తక్కువగా ఉండేలా చూసుకోండి.ఉప్పుశాతం పెరిగిన కొద్ది శరీరంలోకి నీరు చేరి ఇంకా బరువు పెరుగుతారు.

* తీపి మీరనుకున్నంత తీపి ఏం కాదు.స్వీట్లు అవి ఇవి చేసుకుంటే తక్కువగా చేసుకోవాలి.

అలాగే షుగర్ తక్కువగా వాడే స్వీట్లు చేసుకోవాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube