Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సీనీనటి భావనపై కిడ్నాప్ .. అత్యాచారయత్నం-Kidnap And Rape Attempt On Actress Bhavana

ప్రముఖ మలయాళ, తెలుగు, తమిళ నటి భావనని నిన్న రాత్రి కిడ్నాప్ చేసే ప్రయత్నం జరిగినట్టు సమాచారం. కేరళలోని ఎర్నాకులం జిల్లా వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని అపహరించేందుకు యత్నించారని వార్తలు అందుతున్నాయి. ఈ ఆకస్మిక దాడిలో ఎంతమంది పాల్గొన్నారో తెలియదు కాని, ఆమెపై అత్యాచార యత్నం కూడా జరిగిందట.

కిడ్నాప్ తోపాటు అత్యాచారయత్నం చేసిన వ్యక్తుల్లో ఇప్పటికే ఒకర్ని పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే భావన డ్రైవర్లలో ఒకడు పరారిలో ఉండటంతో ఇది ముందే ప్లాన్ చేసిన చర్యగా అనుమానిస్తున్నారు పోలీసులు.

ఇక సంఘటన వివారాల్లోకి లోతుగా వెళితే, భావన నిన్న రాత్రి తిస్సూర్ నుంచి కొచ్చికి వెళుతోందట. భావన కారు అంగమలి అనే ప్రాంతం నుంచి వెళుతుండగా ఓ గుంపుతో నిండిన కారు, భావన కారుని ఢీ కొట్టింది. దాంతో ఆ గుంపుకి, భావనకి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

అక్కడితో ఆ గుంపు, భావన ఫోటోలు తియడం మొదలుపెట్టారు, ఆమెని అక్కడిక్కడ తాకడమే కాకుండా, అత్యాచారయత్నం చేసారు. అదృష్టం కొద్దీ ఆ ప్రాంతానికి దగ్గర్లో భావనకి తెలిసిన ఓ దర్శకుడు ఉండటం, అతనికి సమాచారం అందటం, ఆయన వెంటనే పోలీసులతో సహా స్థలానికి చేరుకోవటంతో ఆ గుంపు పరుగులు తీసింది. చేతికి చిక్కినవాడితో పాటు, భావనతో పాటే ఉన్న డ్రైవర్ ని కూడా పోలీసులు కస్టడిలోకి తీసుకోని దర్యాప్తు మొదలుపెట్టారు.

30 ఏళ్ళ భావన ప్రస్తుతం మళయాళంలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో ఆమె శ్రీకాంత్ తో మహాత్మ, గోపీచంద్ తో ఒంటరి, నితిన్ తో హీరో చిత్రాల్లో నటించారు

Continue Reading

More in Telugu Movie News

  • NEWS

    Sachiin Joshi opens up on Bandla Ganesh controversy

    By

    సంచలన నిర్మాత బండ్ల గణేష్ గురించి ఎప్పుడూ సంచలన వార్తలు వింటూనే ఉన్నాం మనం. బండ్ల ఇంత పెద్ద నిర్మాత అవడానికి...

  • NEWS

    Prabhas is bigger star than Khans

    By

    రామోజి ఫిలింసిటిని సినిమా షూటింగ్ కోసం వాడుకోవటం చూసాం కాని, తొలిసారి ఓ సినిమా ఫంక్షన్ ని పెట్టేసాడు రాజమౌళి. ఎక్కడైతే...

  • NEWS

    RGV is not equal to Pawan Kayan’s foot wear – Bandla

    By

    పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. రెగ్యులర్ మాస్ సినిమా కావడంతో విమర్శకులు సినిమాకి నెగెటివ్...

  • NEWS

    Negative comments on Shruti Haasan’s figure

    By

    శృతి హాసన్ తన కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్ళవుతోంది. వచ్చిన కొత్తల్లోనే “లక్” అనే ఓ హిందీ సినిమాలో బికినీ వేసింది శృతి....

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..