‘కిక్‌ 2’ కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటి?

మాస్‌ మహారాజ రవితేజ తాజా చిత్రం ‘కిక్‌ 2’ చిత్రంకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.కొందరు ఈ సినిమా జస్ట్‌ టైం పాస్‌ ఎంటర్‌టైనర్‌ అంటుండగా, మరి కొందరు యబౌ యావరేజ్‌ అంటున్నారు.

 Kick 2 Movie Collection Details-TeluguStop.com

మరి కొందరు మాత్రం చెత్తగా ఉంది అంటూ తెల్చేస్తున్నారు.మొదటి ఆట నుండి మిశ్రమ టాక్‌ను తెచ్చుకున్నా కూడా ఈ సినిమాకు ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ భారీగానే వచ్చాయి.

సినిమాపై ఉన్న అంచనాల దృష్టి మొదటి మూడు రోజులు చిత్రానికి కలెక్షన్స్‌ భారీగానే ఉంటాయని అందరికి తెల్సిందే.ఆశించినట్లుగానే మొదటి రోజు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా 6.75 కోట్లు వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది.ఓవర్సీస్‌ మరియు ఇతర ప్రాంతాల్లో కలిపి 80 లక్షలను ఈ సినిమా వసూళ్లు చేయగలిగింది.

ఈరోజు మరియు రేపు కూడా చిత్రానికి మంచి కలెక్షన్స్‌ వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు.ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్‌ను రాబట్టడం అంత ఈజీ కాదు అంటు ట్రేడ్‌ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

మొత్తంగా ఈ సినిమా 25 నుండి 28 కోట్ల వసూళ్లను రాబట్టే ఛాన్స్‌ ఉంది అంటు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube