ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్ పై పోలీసులకు పిర్యాదు

తన కుమారుడి బలవన్మరణనికి కారకులైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు, స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ,పోలీసులు పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ బలవన్మరణం పొందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ తల్లి సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు కాపీని, ఆమె తరపున బీజేపీ పార్టీ నాయకులు ఖమ్మం నగర త్రి టౌన్ పోలీసులకు అందజేశారు.తన కుమారుడు సామినేని సాయిగణేష్ కారు డ్రైవర్ గా పని చేసుకుంటూ,దేశం పట్ల ,ధర్మంపట్ల చాలా మక్కువతో ఉండి బీజేపీ పార్టీ లో క్రియాశీలకంగా ఉంటూ సమస్యల పట్ల స్పందిస్తూ ఉండేవాడనీ, ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండతో నా కుమారుడి మీద పలు సందర్భాల్లో తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారని,ఎటువంటి తప్పులు చేయకపోయినా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోద్భలంతో అన్యాయంగా నా కుమారుడిని కేసుల్లో ఇరికించి విచారణ పేరుతో మానసికంగా ,శారీరకంగా నానా చిత్రహింసలకు గురి చేశారాని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Khammam: A Complaint Has Been Lodged With The Police Against Minister Puwada Aja-TeluguStop.com

మా ఇంటి దగ్గరలో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అయిన కన్నం ప్రసన్న కృష్ణ మంత్రి అండతో పోలీసుల్ని ఒత్తిడి చేపించి ప్రతిరోజు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి పిలిపించేవారని, అక్కడ పోలీసులు తీవ్రంగా కొట్టడం , బెదిరించడం చేసేవారని, మా ఇంటి మీద ప్రసన్న కృష్ణ రాళ్లతో దాడి చేసారని, పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.నా కొడుకు మీద అకారణంగా రౌడీషీట్ నమోదు చేపించారు .నా కొడుకు కేవలం తను నమ్మిన సిద్ధాంతం కొరకు పాటుపడటమే అధికార పార్టీ మంత్రికి , పోలీసులకు కార్పొరేటర్ భర్త అయిన ప్రసన్నకృష్ణలు నా కొడుకును వివిధ కేసులలో ఇరికించి నానా చిత్రహింసలకు గురిచేశారు .మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ప్రసన్నకృష్ణ మరియు త్రీటౌన్ సిఐ వేధింపులు తట్టుకోలేక నా కొడుకు పోలీస్ స్టేషన్ లో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు .ఈ స్థితిలో రెండు రోజులు మృత్యువుతో పోరాడి నా కొడుకు 16-4-2022 వ తేదీన తెల్లవారు జామున హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చనిపోయాడు .నా కొడుకు చనిపోవడానికి ముందు అతని యొక్క మరణ వాంగ్మూలం తీసుకోమని ఎంతగా ప్రాధేయపడినప్పటికీ మరణ వాంగ్మూలం తీసుకోకుండా నేరస్థులను కాపాడినటువంటి అధికారులపై చట్టరీత్యా తగిన చర్య తీసుకోవాలని , అదేవిధంగా నా కొడుకు చనిపోవడానికి ముందు మీడియా వారికి మరియు ఇతరులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలంగా పరిగణించి చర్య తీసుకోవాలి .కావున నా కుమారుడు ఆత్మహత్య కు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , కన్నం ప్రసన్నకృష్ణ, త్రీటౌన్ సిఐ మరియు సంబంధిత వ్యక్తులపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube