ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య మీడియా సాక్షిగా సినిమా పాటలకు చిందులేసిన దృశ్యాలు ఇప్పడు నెటిజన్ల హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రెండు సంవత్సరాలవుతున్న సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలు జాయింట్ కలెక్టర్ చేసిన నృత్యాలు హల్చల్ చేస్తున్నాయి.
.ఈ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు అతిధుల కోసం ముందు వరుసలో సీట్లని కేటాయించారు.
కార్యక్రమాన్ని పసందైన వ్యాఖ్యలతో ముందుకు నడిపిస్తున్న యాంకర్ కిందకి దిగి తమతో పాటు డాన్సులు చేయాలని జాయింట్ కలెక్టర్‌ని స్టేజిపైకి ఆహ్వనించడంతో పాటు చేయి పట్టుకుని మరీ స్టేజ్‌మీదకు తీసుకు వెళ్లింది.దీంతో మన ఐఏఎస్ అధికారిణి తప్పించుకోలేక స్టేజ్ ఎక్కేసరికి రేసుగుర్రం సినిమాలోని సినిమా చూపిస్త మావ పాట డిజేలతో హోరెత్తడంతో పాటకు తగ్గట్టుగా అందరితో కల్సి మరి తెగ డాన్సులు చేసింది.
తమ పై అధికారిణే డాన్సు ఇరగదీస్తుంటే, నేనేం తక్కువా అనట్టు డిప్యూటీ కలెక్టర్ కూడా కాలు కదిపి పూనకం వచ్చినట్టు ఊగి పోయాడు.
కాగా ఐఏఎస్ అధికారిణి రికార్డింగ్ డాన్సులు చేసిన ఈ వ్యవహారం నెట్లో తీప్ర పెద్ద సంచలనం రేపుతోంది.
కావాలంటే మీరూ ఈ వీడియో చూడండి.
.