అక్కడ ఖైదీ నం 150 డిస్ట్రిబ్యూటర్ కి చెమటలు పడుతున్నాయి

యూఎస్ ప్రీమియర్స్ లో 1.2 మిలియన్ల డాలర్లు దాటగానే తెగ సంబరపడిపోయారు మెగా అభిమానులు.ఇది మెగాస్టార్ స్టామినా అంటూ జబ్బలు చరుచుకున్నారు.కాని అభిమానులందరు ఢీలా పడేలా, ముఖ్యంగా పంపిణీదారులకి చెమటలు పట్టేలా, ప్రీమియర్స్ తరువాత అసలు కథ మొదలైంది.

 Khaidi No 150 Falls Down In Overseas-TeluguStop.com

ఖైదీనం 150 బుధవారం (యూఎస్ లో ప్రీమియర్స్ తరువాతి రోజు) ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? $157 .అంటే లక్ష యాభై ఏడు వేల డాలర్లు.పన్నెండు లక్షల డాలర్ల నుంచి ఒక్కసారిగా లక్ష యాభైకి పడిపోయింది సినిమా.మూడొవరోజు కూడా ఏమంత గొప్పగా మొదలవ్వలేదు.ఖైదీ కన్నా మెరుగ్గా గౌతమీపుత్ర శాతకర్ణి గురువారాన్ని మొదలుపెట్టింది.(అమెరికా కాలమానం ప్రకారం).

ఖైదీ నం 150 అమెరికాలో కనీసం 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప, అక్కడి పంపిణీదారులకి నిద్రపట్టదు.ఈ ట్రెండ్ చూస్తోంటే, ఓవర్సీస్ లో ఈ సినిమాకి కష్టాలు తప్పేలా లేవు.మరోవైపు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం చిరంజీవి ఇమేజ్ తో సినిమా మంచి స్పీడ్ మీద ఉంది.

భారతదేశంలో మెగాస్టార్ ఛరిష్మా బాగా పనిచేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube