పాస్ వర్డ్ పెట్టుకోగల పెన్ డ్రైవ్ వచ్చేసింది

పెన్ డ్రైవ్స్ లో డేటా స్టోర్ చేయడానికి మందు వెనక ఆలోచిస్తారు ఎవరైనా.పొరపాటులో పెన్ డ్రైవ్ పోగొట్టుకుంటే ఏంటి పరిస్థితి అని.

 Keypad Pendrives With Password Launched-TeluguStop.com

అందుకే పర్సనల్ వ్యవహారాలు పెన్ డ్రైవ్ లో పెట్టడానికి భయపడతారు.కాని ఇకముందు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు.

మీరు నిర్భయంగా పెన్ డ్రైవ్ లో మీ పర్సనల్ డేటా స్టోర్ చేసుకోవచ్చు.ఒకవేళ పెన్ డ్రైవ్ మరో వ్యక్తి చేతికి చిక్కినా మీకు ఎలాంటి నష్టం జరగదు.

ఎందుకంటే పాస్ వర్డ్ వసతులతో పెన్ డ్రైవ్స్ వచ్చేసాయి.

యూఎస్బీ డివైజ్ల తయారిదారులు కింగ్ స్టన్ ఈ కొత్త తరహా పెన్ డ్రైవ్స్ ని మార్కెట్లోకి దింపింది.

డీటి 2000 అని దీనికి నామకరణం చేసారు.పెన్ డ్రైవ్ మీదే ఓ కీప్యాడ్ ఉంటుంది.

దీని ద్వారా మీరు పెన్ డ్రైవ్ కి పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు.ఏ డివైజ్ కి పెన్ డ్రైవ్ ని కనెక్ట్ చేసినా, అందులోని కంటెంట్ ఓపెన్ చేయాలంటే పాస్ వర్డ్ టైప్ చేయాల్సిందే.

మళ్ళీ పెన్ డ్రైవ్ ని ఎజెక్ట్ చేయగానే తిరిగి లాక్ యాక్టివేట్ అయిపోతుంది.వరుసగా పదిసార్లు పాస్ వర్డ్ తప్పుగా టైప్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.

ఇక ధరల విషయానికి వస్తే 16 GB వెరియంట్ ₹10,000, 32 GB వేరియంట్ ధర ₹14,000, 64 GB వేరియంట్ ధర ₹ 18,000 లుగా నిర్ణయించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube