Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కేశవ మూవీ రివ్యూ -Keshava Movie Review Keshava Movie Collections,Keshava Movie First Day Talk,Keshava Movie Review,nikhil,ritu Varma

చిత్రం : కేశవ

బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్

దర్శకత్వం : సుధీర్ వర్మ

నిర్మాత : అభిషేక్ నామా

సంగీతం : సన్ని ఎమ్ ఆర్

విడుదల తేది : మే 19, 2017

నటీనటులు – నిఖిల్, రిటూ వర్మ, ఇషా కొప్పికర్

వైవిద్యభరితమైన సినిమాలు చేసే నటుడు నిఖిల్. వరుసగా హిట్లు పడుతున్న స్టార్ డమ్ మోజులో మాస్ సినిమాలు చేయట్లేదు, లవ్ స్టోరిలతో సేఫ్ గేమ్ ఆడట్లేదు. సినిమా సినిమాకి కథల ఎంపికలో వర్సటాలిటి చూపిస్తున్న నిఖిల్, ఈసారి రివేంజ్ డ్రామా కేశవతో మనముందుకి వచ్చాడు. కేశవ అద్యంతం ఎలా సాగిందో చూడండి.

కథలోకి వెళితే :

కేశవ్ (నిఖిల్) అమ్మనానలు ఓ యాక్సిడెంటులో చనిపోవడంతో కథ మొదలవుతుంది. ఇతనిది ఓ వింత సమస్య. గుండె కుడివైపుకు ఉంటుంది. దాంతో అత్యుత్సాహం, భావోద్వేగాలకు తట్టుకోలేడు. ఏ పని చేసినా కూల్ గా చేయాలి. అది మర్డర్ అయినా సరే. తనకున్న సమస్య వలన తన ఉద్వేగాల వేడి తగ్గాక తన తల్లిదండ్రులని చంపినవారి వేట మొదలుపెడతాడు కేశవ్. అతడికి తన పరిమితుల్లో సహాయం చేస్తూ ఉంటుంది సత్యభామ (రిటువర్మ).

ఇక ఈ కేశవ్ ని పట్టుకోవడానికి వచ్చే స్పెషప్ ఆఫీసర్ షర్మీలా (ఇషా కొప్పికర్). షర్మీలా కేసు టేకప్ చేసాక కూడా కేశవ్ దూకుడు కొనసాగిందా? కేశవ్ తల్లిదండ్రులు చనిపోవడానికి అసలు కారకులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం సినిమాలో చూడండి.

నటీనటులు నటన :

నిఖిల్ చేసిన అన్నిపాత్రల్లోకి ఇది డిఫరెంట్ పాత్ర. ఎందుకంటే కేశవ్ మాట్లాడేది తక్కువ. జరుగుతున్న విషయాలకి రియాక్ట్ అయ్యేది తక్కువ. సబ్టిల్ గా ఉంటూనే తనలో రగులుతున్న పగను చూపించాలి. లోలోనే అన్ని అణచుకోవాలి. అన్నిపనులు సక్రమంగా చేసాడు నిఖిల్. నిఖిల్ ఇంటెన్సిటి ఉన్న పాత్రలు కూడా బాగా చేయగలడు అని నిరూపించుకున్నాడు.

రిటూ వర్మ స్క్రీన్ మీద చేయడానికి పెద్దగా ఏమిలేదు. కాని తెలుగురాని హీరోయిన్లు కన్నా నేచురల్ గా అనిపించే రీటూ నూరుపాళ్ళు నయం. తన అభినయం బాగున్నా, టాలెంట్ ఉన్న నటికి సరిపడా క్యారక్టర్ రాసుకోలేదని సరిపెట్టుకోవమే. ఇషా కొప్పికర్ నటన సూపర్బ్ అనలేం కాని, బాగా చేసింది. అనసూయ డబ్బింగ్ చెప్పకుండా, ఇషానే సొంతంగా మాట్లాడితే ఆ పాత్ర ఇంకా బాగా పండేది. రావు రమేష్ ఒకే. ప్రియదర్శి, వెన్నెల కొషోర్ కొన్ని నవ్వులు పూయించారు.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Featured

  • Reviews

    Keshava Movie Review

    By

    చిత్రం : కేశవ బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్ దర్శకత్వం : సుధీర్ వర్మ నిర్మాత : అభిషేక్ నామా సంగీతం...

  • Reviews

    Radha Movie Review

    By

    చిత్రం : రాధ బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర దర్శకత్వం : చంద్రమోహన్ నిర్మాత : భోగవళ్ళి బాపినీడు...

  • Reviews

    Babu Baga Busy Review

    By

    చిత్రం : బాబు బాగా బిజీ బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్ దర్శకత్వం : నవీన్ మేడారం నిర్మాత : అభిషేక్...

  • Reviews

    Baahubali 2 Movie Review

    By

    చిత్రం : బాహుబలి 2 – ది కంక్లూజన్ బ్యానర్ : అర్కా మీడియా దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి...

To Top