ముసలి హీరోలతో చేసేది లేదు అంటున్న హీరోయిన్

మళయాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతోకాలం పట్టలేదు.ఫక్తు గ్లామరస్ ఇండస్ట్రీలుగా పేరున్న తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో కూడా కీర్తి భారి ఆఫర్లు పట్టడం, కమర్షియల్‌ అగ్రహీరోల సరసన నటించడం చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం.

 Keerthy Suresh Strictly Says No To Senior Heroes-TeluguStop.com

ఎందుకంటే కీర్తి స్కిన్ షో చేయదు.అవసరమైతే ఛాన్సులు వదిలేసుకుంటుందేమో కాని కురచ దుస్తులు మాత్రం అస్సలు తొడగదు.

ఇప్పుడు ఈ కండీషన్ తో పాటు మరీ కొత్త కండీషన్ పెట్టింది కీర్తి.అదేంటంటే, ముసలి హీరోలతో అస్సలు నటించదట.

దక్షిణాదిన డజను దాకా ఉన్నారు సీనియర్ హీరోలు.వీళ్ళందరితోనూ నటించేది లేదు అంటే ఏడాదికి ఓ పదిహేను సినిమాల్లో అసలు కీర్తిని పరిశీలంచరు కూడా.

ఇన్ని అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా, తన పాలసీ తన ఇష్టం అంటోంది కీర్తి.ఏది ఏమైనా ముసలి హీరోలతో మాత్రం కలిసి చిందేయను అని అంటోంది.గ్లామరస్ గా కనబడదు, సీనియర్ హీరోలు వద్దు, పైగా సినిమాకి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రెమున్యరేషన్ .ఈ లెక్కలేవో తేడా కొట్టేలా ఉన్నాయి కదా.

అయితే మరో ఒకటి రెండు సంవత్సరాల వరకు మాత్రం కీర్తి కెరీర్ కి పెద్దగా ఢోకా లేదనే చెప్పాలి.తెలుగు గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ సినిమాలో మేయిన్ హీరోయిన్ తనే.అలనాటి నటి సావిత్రి జీవిత చరత్రని సినిమాగా తీస్తున్నారుగా, అందులో సావిత్రి పాత్రని పోషిస్తున్నది కూడా కీర్తినే.కాబట్టి ఈ సినిమాల తరువాత, ఇన్ని కండీషన్స్ తో కీర్తి ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకుంటుందో, ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube