విప్పటం నా వాళ్ళ కాదు అన్న హీరోయిన్

నేను శైలజ అంటూ వచ్చి కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించిన కీర్తి సురేష్ ఒక్క సినిమాకే దాదాపు ఓ ఐదారు సినిమాల క్రేజ్ దక్కించుకుంది.శైలజ హిట్ అయినా వెంటనే తెలుగులో సినిమాలు చేయని ఈ అమ్మడు కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉంది.

 Keerthi Opens About Glamours Roles-TeluguStop.com

అయితే ఏ భాషలో సినిమా చేసినా తాను మాత్రం గ్లామర్ షో చేసేది లేదు అని తెగేసి చెప్పేసింది ఈ అమ్మడు.ప్రస్తుతం కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ 60వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్ శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న రెమోలో కూడా నటిస్తుంది.

ఇక తెలుగులో నాని పక్కన లోకల్ అంటుంది ఈ చిన్నది.పాతితోషికం గట్రా పెంచేసిందని వచ్చిన వార్తలకు అలాటిదేం లేదని ఆన్సర్ ఇచ్చింది.

తాను ఇంకా అంత పెద్ద స్టార్ కాలేదంటూ తన మీద తానే సెటైర్స్ వేసుకుంది.అతి తక్కువ కాలంలో ఆడియెన్స్ మనసు గెలుచుకున్న కీర్తి ఎప్పటికి ఇలానే తనకు సరిపడే పాత్రలతోనే సినిమాలు చేస్త్త తప్ప స్కిన్ షోల జోలికి వెళ్లను అని ఖరాకండిగా చెప్పెస్తుంది.

మరి అవకాశాలొస్తున్నప్పుడు ఇలానే మాట్లాడుతారు కొద్దికాలానికి ఛాన్సులు తగ్గుముఖం పడుతున్న టైంలో తమలోని మరో యాంగిల్ చూపించడం హీరోయిన్స్ కు అలవాటే.మరి కీర్తి కూడా వారిలానే చేస్తుందా లేక అన్న మాట మీద నిలబడుతుందా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube