ముప్పయ్‌ఏళ్లు ఆయనే సీఎం

తెలంగాణ రాష్ర్టాన్ని మరో ముప్పయ్‌ఏళ్లపాటు కేసీఆరే పరిపాలిస్తారు.పార్టీని కూడా ఆయనే నడిస్తారు.

 Kcr Will Rule Telangana For 30 More Years Says Ktr-TeluguStop.com

ఆయన అరవైరెండేళ్ల యువకుడు…ఈ మాటలన్నది కేసీఆర్‌కు విధేయుడైన మంత్రో, ఎమ్మల్యేనో, ఎంపీయో కాదు.ఆయన కుమారుడు, రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.

ఆయన తండ్రిపై ప్రశంసల జల్లు కురిపించారు.తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం కోసం టీఆర్‌ఎస్‌ పోరాటం చేసిందని, చివరకు రాష్ర్టాన్ని సాధించిందని అన్నారు.

కేసీఆర్‌ వారసుడు ఎవరూ అన్న విషయంలో చర్చకు తావు లేదని, మరో ముప్పయ్‌ ఏళ్లవరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.తెలంగాణ రాష్ర్టం సాదించిన టీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారం బోనస్‌గా వచ్చిందన్నారు.

బంగారు తెలంగాణ సాధనే కేసీఆర్‌ లక్ష్యమన్నారు.మరో ముప్పయ్‌ ఏళ్లు తన తండ్రే సీఎంగా ఉంటారని కుమారుడు చెబుతుంటే, మొన్నీమధ్య కేసీఆర్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో, గెలవమో అనే సందేహం వ్యక్తం చేశారు.

మేనల్లుడు హరీష్‌రావు కేసీఆర్‌ కొంప ముంచి తానే సీఎం అవుతాడని, ఇది భవిష్యత్తులో జరుగుతుందని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.పార్టీ పగ్గాలు కుమారుడు కేటీఆర్‌కు అప్పగిస్తారని కొందరు చెబుతున్నారు.

ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనబడుతోంది.పశ్చిమ బెంగాల్‌ను సీపీఎం నేత జ్యోతి బసు సుదీర్ఘకాలం పరిపాలించారు.

ఆయన కథ వేరు.కాని కేసీఆర్‌కు అంత ఇమేజ్‌ ఉందా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube