మోడీపై కేసీఆర్ యూ ట‌ర్న్ వెన‌క‌..?

తాను ప‌ట్టిన ప‌ట్టు విడిచిపెట్టేది లేద‌ని, చెప్పిన మాట‌ను వెన‌క్కి తీసుకునేది లేద‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చే తెలంగాణ సీఎం కేసీఆర్ నోట్ల ర‌ద్దుపై పూర్తిగా యూట‌ర్న్ తీసుకున్నారు.ఈ నెల 8న రాత్రి స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంపై కేసీఆర్ అంత‌ర్గ‌తంగా చాలా ఫైర‌య్యారు.

 Kcr U-turn Over Notes Demolition-TeluguStop.com

ఇలాంటి నిర్ణ‌యాల‌తో తెలంగాణ‌కు రావాల్సిన ఆదాయం పూర్తిగా ప‌డిపోయింద‌ని, వ్యాపారాలు నిలిచిపోయాయ‌ని, రెవెన్యూ న‌ష్టం కోట్ల‌కు చేరిపోయింద‌ని అధికారుల వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో మండిప‌డిన విష‌యం ప‌త్రిక‌ల్లో ప్ర‌ధానంగా వ‌చ్చింది.

దీంతో ఆయా విష‌యాల‌పై చ‌ర్చించేందుకు ఇటీవ‌ల కేసీఆర్ ప్ర‌ధాని మోడీని క‌లిసివ‌చ్చారు.

అయితే, అక్క‌డ ఏం జ‌రిగిందో ఏమో కానీ… ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా యూ ట‌ర్న్ తీసుకున్నారు.న‌ల్ల‌ధ‌నం ర‌ద్దును గొప్ప డెసిష‌న్‌గా హైద‌రాబాద్‌లో మీటింగ్ పెట్టి మ‌రీ ఉద్ఘాటించారు.

అంతేకాదు, నోట్ట ర‌ద్దుతో దేశానికి మంచి జ‌రుగుతుంద‌ని, ఈ విష‌యంలో తెలంగాణ స‌ర్కారు పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని కూడా తెలిపారు.అంతేకాకుండా.

రాష్ట్రంలో క్యాష్ లెస్ ట్రాన్సాక్ష‌న్‌ను పెంచుతామ‌ని, దీనికిగాను ఇప్ప‌టికే ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు.

సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక మోడల్ గా తీసుకొని క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్‌ను అమ‌లు చేస్తామ‌ని, అక్క‌డి రిజ‌ల్ట్‌ను బ‌ట్టి రాష్ట్ర వ్యాప్తంగా మ‌రింతగా డెవ‌లప్ చేస్తామ‌న్నారు.

ఇక‌, ఇప్పుడు కేసీఆర్ ఇలా యూట‌ర్న్ తీసుకుంటార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.నిజానికి ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్‌.

తెలంగాణ‌లో త‌మ‌కు అధికార కేసీఆర్ కూడా క‌లిసి వ‌స్తార‌ని భావించింది.కానీ, ఇంత‌లో కేసీఆర్ ఇలా యూట‌ర్న్ తీసుకోవ‌డంతో అంటే భ‌విష్య‌త్తులో 2019లో మోడీతో పొత్తు కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారా ? లేకుంటే ఇంత‌లా ఎందుకు పొగిడారు… అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నిజానికి కేసీఆర్‌కి ఇప్పుడున్న బ‌లం స‌రిపోతుంది.అయితే, కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే.ఆశించిన విధంగా త్వ‌ర‌గా నిధులు అందే అవ‌కాశం ఉంటుంద‌ని, స్టేట్ డెవ‌ల‌ప్ మెంట్‌కి ఉప‌యోగంగా ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది.ఈ నేప‌థ్యంలో పెద్ద నోట్ల ర‌ద్దును ఆయ‌న స్వాగ‌తిస్తున్న‌ట్టు చెబుతున్నారు.

అందుకే మోడీ విష‌యంలో ఆయ‌న కేవ‌లం 15 రోజుల్లోనే యూ ట‌ర్న్ తీసుకున్నార‌ని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube