అతి వినయం...!

అతి వినయంగా ఉండటం అదేదోలక్షణం అంటారు.అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని చెప్పలేంగాని ఆయన మాత్రం రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీ వద్ద అతి వినయం ప్రదర్శించారు.

 Kcr Touches President’s Feet-TeluguStop.com

రాష్ర్టపతి ప్రతి ఏటా కొన్ని రోజులు దక్షిణ భారతంలో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది.ఆ ప్రకారమే సోమవారం హైదరాబాదుకు వచ్చారు.

రాష్ర్టపతి భవన్‌ ఉన్నది ఇక్కడే కదా.ప్రణబ్‌కు స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌ అక్కడే ఆయనకు పాదాభివందనం చేశారు.పెద్దవారికి పాదాభివందనం చేయడం తప్పు కాదు.ఎందుకంటే ప్రణబ్‌ రాజకీయ అనుభవం రీత్యా, వయసులోనూ కేసీఆర్‌ కంటే ఎంతో ఎక్కువ.స్వాగతం పలకడానికి ముందు ప్రణబ్‌కు పాదాభివందనం చేసి ఆ తరువాత సాదరంగా ఆహ్వానించారు.విమానాశ్రయానికి గవర్నర్‌ నరసింహన్‌, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్‌ తదితరులు వెళ్లారు.

గతంలో గవర్నర్‌ నరసింహన్‌కు, ఆధ్మాత్మికవేత్త చినజీయర్‌ స్వామికి కూడా కేసీఆర్‌ పాదాభివందనం చేశారు.పెద్దవారంటే కేసీఆర్‌కు అత్యంత గౌరవం కావచ్చు.

అందుకే ఈవిధంగా చేస్తుంటారు.తెలంగాణలోని కొన్ని కుటుంబాల్లో పెద్దవారికి చిన్నవారు పాదాభివందనం చేస్తుంటారు.

ఉత్తర భారతదేశపు ఈ కల్చర్‌ తెలంగాణలోనూ ఉంది.ఉత్తర భారతానికి సంబంధించిన అనేక సాంస్కృతికపరమైన అంశాలు తెలంగాణలో కనబడతాయి.

తెలంగాణలో ఉత్తర భారతం నుంచి అనేక కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి కదా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube