కెసిఆర్ హుందాగా , చంద్రబాబు చీప్ గా !!

రాజకీయ ప్రత్యర్దులని విమర్శించడానికి ఏ ఒక్క చిన్న విషయాన్నీ వదలరు మనవారు.అదే కోవలో చంద్రబాబు నాయుడు అప్పట్లో కాంగ్రెస్ రూల్ లో, రాజశేకర రెడ్డి హయాం లో వచ్చిన ఆరోగ్య శ్రీ పథకం మీద కూడా సీరియస్ అవుతున్నారు.

 Kcr Praises 108 Services In Ysr Era-TeluguStop.com

అది కేవలం కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే ఉపయుక్తంగా నిలిచిందని చంద్రబాబు ఆరోపించారు.అయితే ఈ ఆరోపణలు ఆయన కొత్తగా చేస్తున్నవేమీ కాదు.

ఆరోగ్యశ్రీ విషయంలో తెలుగుదేశం వాళ్లు ఆది నుంచి అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నారు.ప్రభుత్వం మొదలెట్టిన ఏ పథకం లో మాత్రం లోపాలు ఉండవు? అది చాలా సహజం కానీ ఆరోగ్య శ్రీ కొన్ని లక్షల మంది పేదవారికి చక్కగా ఉపయోగపడింది అనేది వాదించలేని అంశం దాని మీద కూడా చంద్రబాబు సీరియస్ అవ్వడం ఆశ్చర్యపరుస్తోంది.కేవలం కార్పరేట్ ఆసుపత్రులకి మాత్రమే ఇది ఉపయోగపడింది అనేది వారి వాదన అయితే మరి తమ హయాం వచ్చాక పేరు తప్ప ఆరోగ్యశ్రీ విషయంలో ఒక్క మార్పు కూడా చెయ్యలేదు.నిజంగా లోపాలు ఉంటే వాటిని వదిలేసేవారా ? ఈ విషయంలో కెసిఆర్ తన హుందాతనం నిరూపించుకున్నారు.వైఎస్ హయాంలో 108ల పనితీరు గురించి ఒక ఉదంతాన్ని వివరించారు కేసీఆర్.

తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతంలో తన పర్యటన సాగుతుండగా.

అక్కడ రోడ్డుపై ఒక యాక్సిడెంట్ అయితే.గాయపడ్డ వారిని తన కారు ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్తాను అన్నా.

స్థానికులు వద్దన్నారని, 108 వస్తుందని విశ్వాసంతో తన సాయాన్ని వద్దన్నారని, వారు అన్నట్టుగా కొన్ని నిమిషాల్లోనే 108 వచ్చి బాధితులను తీసుకెళ్లిందని కేసీఆర్ అసెంబ్లీలో వివరించారు.ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డి బాబు కీ కెసిఆర్ కీ ఇద్దరికీ రాజకీయ శత్రువే కానీ నిజాలు నిర్ద్వందంగా మాట్లాడుకునే తప్పుడు సరిగ్గా ప్రవర్తించాలి అనేది ఇలాంటి ఉదాహరణల వల్ల మాత్రమే బయట పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube