అవినీతి పై 'ఉక్కుపాదం'

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి ఆలోచనలు ఆ ప్రాంతం ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే….అసలే ఆయాన ఉధ్యామకారుడు, పైగా అనుభవం లేని వాడు అలాంటిది, ఎలా ప్రజలను పాలిస్తాడో అని, అందరిలో కాకపోయినా, మెజారిటీ ప్రజలు ఇలానే ఆలోచించారు.

 Kcr Mark Rule In Telangana-TeluguStop.com

అయితే వారి ఆలోచనలను తలకిందులు చేస్తూ ఆయన సాగిస్తున్న పాలన భేష్ అని మెచ్చుకోక తప్పదు…అవినీతి విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ద నిజంగా అభినందనించాల్సిన విషయమే.ఇదిలా ఉంటే మరో పక్క వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యను తెలంగాణా క్యాబినెట్ నుంచి తప్పించారు.

ఇక ఆ తరువాత ఆ స్థానాన్ని కడియం శ్రీహరికి కట్ట బెట్టారు.ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం చేసిన కడియం మాట్లాడుతూ… తెలంగాణ పునర్నిర్మాణంలో తాను భాగస్వామిని అవుతానని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సైనికుడిలా పని చేస్తానని మంత్రి కడియం తెలిపారు.

ఇక కేసీఆర్ సైతం ఎవరు తప్పు చేసినా చూస్తూ ఊరుకోనని, తన సొంత వారైనా అవినీతి చేస్తే సహించేది లేదు అన్న విషయం ఇప్పటికే విన్నాం.ఇక రాజయ్య విషయంలో చూశాం.

మరి ఇదే పద్దతి కేసీఆర్ సారు.రానున్న 5ఏళ్లు పాటిస్తారో, లేక సొంత వారి విషయానికి వచ్చే సరికి చేతులెత్తేస్తారో.

చూద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube