ఆ ఇద్ద‌రికి షాక్ ఇచ్చిన కేసీఆర్‌..!

తెలంగాణలో విప‌క్ష పార్టీల‌కు చెందిన ప‌లువురు నేత‌లు అధికార టీఆర్ఎస్ గూట్లోకి జంప్ చేసేశారు.ఈ జంపింగ్ లీడ‌ర్ల‌లో కొంద‌రికి కేసీఆర్ ప‌ద‌వులు కూడా ఇచ్చారు.

 Kcr Gave Shock To Two Mlas-TeluguStop.com

ఇత‌ర పార్టీల‌కు చెందిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మ‌హేంద‌ర్‌రెడ్డి లాంటి వాళ్ల‌లో కొంద‌రు ఎన్నిక‌ల‌కు ముందు, మ‌రికొంద‌రు ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ మారినా వారికి కేసీఆర్ త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించారు

ఈ క్ర‌మంలోనే కొంద‌రు సీనియ‌ర్లు సైతం త‌మ‌కు మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు.పాత వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన పాల‌కుర్తి ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యా నాయ‌క్ ఇద్ద‌రూ కీల‌క నాయ‌కులు.

ముఖ్యంగా ఎర్ర‌బెల్లి టీడీపీలో ముఖ్య నాయ‌కుడిగా ఉన్నారు.టీడీపీఎల్పీ నేత‌గానూ పనిచేశారు.

ఇక రెడ్యానాయ‌క్ వైఎస్ హ‌యాంలో మంత్రిగానూ ప‌నిచేశారు

వీరిద్ద‌రు కూడా కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ కోసం కేసీఆర్ చుట్టూ వంద‌ల‌సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మంది కారెక్క‌డం వెన‌క ఎర్ర‌బెల్లి ఉన్నార‌ని.

ఆయ‌న‌కు కేసీఆర్ త‌ప్ప‌కుండా మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.అయితే ఆయ‌న‌కు సామాజిక‌వ‌ర్గం మైన‌స్‌గా మారింది.

కేసీఆర్‌ది-ఎర్ర‌బెల్లిది ఒకే సామాజిక‌వ‌ర్గం

ఈ సామాజిక‌వ‌ర్గం నుంచి ఇప్ప‌టికే కేసీఆర్‌-కేటీఆర్‌-హ‌రీష్‌-జూపూల్లి ఉన్నారు.ఇక ఎర్ర‌బెల్లికి మంత్రి ప‌ద‌వి రాద‌ని తేలిపోయింద‌ట‌.

ఈ విష‌యంలో కేసీఆర్ ఆయ‌న‌కు అస్స‌లు క్లారిటీ ఇవ్వ‌డం లేద‌ట‌.ఇక రెడ్యానాయ‌క్‌కు సైతం ఎస్టీ కోటాలో మ‌రో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే ఎస్టీ కోటాలో చందూలాల్ ఉన్నారు

అవ‌స‌ర‌మైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న కుమార్తె క‌విత‌కు మ‌హ‌బూబాబాద్ నుంచి ఎమ్మెల్యే సీటు ఇస్తామ‌ని.దాంతో స‌రిపెట్టుకోమ‌ని ఆయ‌న‌కు చెప్పార‌ట‌.

దీంతో ఆయ‌న చేసేందేం లేక సైలెంట్ అయ్యార‌ని తెలుస్తోంది.దీంతో మంత్రి ప‌ద‌విపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుని కారెక్కిన ఈ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడు క‌క్క‌లేక మింగ‌లేక పార్టీలో ఉంటున్నార‌ట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube