ఐదు కోట్లు తగలేశారా?

ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎక్‌్సగ్రేషియా ఇవ్వాలంటే, పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటే సవాలక్ష కారాణాలు చెప్పి గీసిగీసి డబ్బులు సర్కారు అనవసరమైన పనులకు చాలా దుబారా చేసే సంగతి మనకు తెలుసు.సామాన్యలకు అనేక నిబంధనలు పెట్టే ప్రభుత్వం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏ నిబంధనలూ పెట్టదు.

 Kcr Expressed  Anger Over Spending Rs 5 Crore On The Bus-TeluguStop.com

వారి విలాసాలకు, ఆడంబరాలకు ఎంతైనా ఖర్చు చేస్తారు.తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆ పని చేశారని కేసీఆర్‌ మాటలను బట్టి అర్థమవుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాల పర్యటనల కోసం అత్యంత ఖరీదైన, విలాసవంతమైన బస్సు కొనుగోలు చేశారు అధికారులు.ఈ బస్సు వైభవం చెప్పాల్సిన పని లేదు.

ఇది ఇల్లు కమ్‌ ఆఫీసు కమ్‌ మీటింగ్‌ హాల్‌….సమస్త సౌకర్యలూ ఉన్నాయి.

మెర్సిడెజ్‌ బెంజ్‌ కంపెనీ తయారు చేసిన ఈ బస్సు ఖరీదు ఐదు కోట్ల రూపాయలు.దీన్ని గురించి ఇదివరకే మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ ఖరీదైన బస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొట్టమొదటిసారిగా ప్రయాణం చేశారు.ఇలాంటి బస్సులో ప్రయాణం చేసినందుకు ఆయన సంతోషించాలి కదా…! కాని అధికారులపై ఆగ్రహించాడట….! ఐదు కోట్ల రూపాయలు అనవసరంగా తగలేశారని కోపగించుకున్నాడట.ఈ బస్సులో ఆయన ఆదివారం జిల్లాల పర్యటనకు వెళ్లారు.కొంత దూరం బాగానే ప్రయాణించిన తరువాత ఆయన యథాతథంగా తన కాన్వాయ్‌లో ప్రయాణించారు.ఎందుకు? బస్సులోని ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్‌లో లోపం వచ్చింది.సీట్లు బాగాలేవని సీఎం పెదవి విరిచారు.ప్రజలను ఉద్దేశించి మాట్లాడే పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ సరిగాలేదు.ఇదీ ఈ బస్సు కత.అధికారులు బస్సు కండిషన్‌ ముందుగా చూసుకోరా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube