టీ స్కూళ్లకు సెలవులు

తెలంగాణ రాష్ట్రాన్ని స్వైన్‌ ప్లూ వణికిస్తోంది.ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడి మరణించారు.

 Kcr May Declare Holidays To Schools-TeluguStop.com

వందల సంఖ్యలో జనాలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు.దాంతో తెలంగాణ ప్రభుత్వం స్వైన్‌ప్లూపై యుద్దం ప్రకటించింది.

కేంద్రం సాయం కోరడంతో పాటు రాష్ట్రంలోని కార్పోరేట్‌ హాస్పిటల్‌లలో ఈ వ్యాధికి సంబంధించిన విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ప్రభుత్వంకు చెందిన అన్ని విభాగాలు కూడా స్వైన్‌ప్లూపై పని చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించాడు.

ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు రాష్ట్రంలోని స్కూళ్లను బంద్‌ చేయాల్సిందిగా కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాశాఖతో మాట్లాడి నాలుగు రోజుల పాటు స్కూళ్లకు బంద్‌ ప్రకటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల నుండి సమాచారం అందుతోంది.ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఇలా హంగామా చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube