కేసీఆర్ క్లీన్ స్వీప్ ప్లాన్ ఇదే

తెలంగాణ ఉద్య‌మం నేప‌థ్యంలో పురుడు పోసుకున్న టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ సాధ‌న త‌ర్వాత అధికారంలోకి రావ‌డం, ప్ర‌త్యేక రాష్ట్రం కోసం విశ్ర‌మించ‌ని పోరాటం చేసిన కేసీఆర్‌.సీఎం కావ‌డం అంద‌రికీ తెలిసిందే.అయితే, ఇప్పుడు కేసీఆర్ మ‌రో టార్గెట్ పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్న వాతావ‌ర‌ణం మ‌న‌కు క‌నిపిస్తోంది.2019లోనూ తానే అధికారంలోకి వ‌చ్చేలా… టీఆర్ ఎస్ కారే తెలంగాణ వీధుల్లో ప‌రుగులు తీసేలా కేసీఆర్ ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు.దీనికి గాను ఆయ‌న ఇప్ప‌టి నుంచే ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణను కూడా సిద్ధం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో అంటే టీఆర్ ఎస్‌.టీఆర్ ఎస్ అంటే తెలంగాణ అన్న‌లెక్క‌లో ముందుకు సాగాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

 Kcr Clean Sweep Plan-TeluguStop.com

2019 ఎన్నిక‌లకు ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది.అయితే, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉవ్వెత్తున ఎగిసి ప‌డాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.

అంటే దాదాపు 90 నుంచి 95 స్థానాల్లో టీఆర్ ఎస్‌ని గెలిపించుకోవాల‌ని, విప‌క్షాల‌కు నామ మాత్ర‌పు సీట్లు త‌ప్ప డిపాజిట్లు కూడా రాకుండా చేయాల‌ని ఇప్ప‌టి నుంచే ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రెడీ అవుతున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధ‌న అనంత‌రం ప్ర‌భుత్వ ప‌రంగా తాము చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, ప్ర‌జా ఉప‌యోగ కార్య‌క్ర‌మాలు, ప్రాజెక్టులు వంటి అనేక విష‌యాలను ఆయ‌న ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌ని భావిస్తున్నారు.

ప్ర‌జ‌ల‌తో స‌మానంగా టీఆర్ ఎస్‌కి క‌న్ను, కాలు వంటి కార్య‌క‌ర్త‌ల విష‌యంలోనూ గులాబీ బాస్ దృష్టి పెట్టారు.అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు గ‌డిచినా.నాడు ఉద్య‌మంలో ఎంతో చురుగ్గా త‌మ‌కు ఏమీ ద‌క్క‌లేద‌నే బాధ‌లో ఉన్న కార్య‌క్ర‌త‌ల‌కు కూడా ఏదైనా చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే మిషన్‌భగీరథ ప్రాజెక్టుల్లో చిన్న, చితర పనులు కార్యకర్తలకు, స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించబోతున్నారు.

సుమారుగా 4వేల కోట్ల మేరకు ఈ పనులుండబోతున్నట్లు సమాచారం.ప్రాజెక్టులు, ఆసరా, బీడీ కార్మికులకు పెన్షన్లు, ఉద్యోగులకు వేతనాల పెంపు, అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు, ఇంటింటికీ తాగునీరు, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయనున్నారు.

అదేవిధంగా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా.హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం, నిరంతర విద్యుత్‌ సరఫరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్‌, టీహబ్‌ వంటి వినూత్న పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

మొత్తంగా వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో విజ‌యానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ చేప‌ట్టేలా ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను ఇప్ప‌టి నుంచే ర‌చిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే ఈ నెల 16 న అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

జిల్లాల అభివృద్ది అజెండాను వారితో చ‌ర్చించి.ఇటు అధికారికంగా, అటు రాజ‌కీయంగా పెద్ద స్టెప్ తీసుకుని విప‌క్షాల‌ను ఖంగు తినిపించాల‌ని కేసీఆర్ వ్యూహం సిద్దం చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube