టీడిపి నేత ను అన్నా అని పిలిచిన కేసీఆర్

తెలుగు దేశం పార్టీ పేరు చెబితేనే అంతెత్తున ఎగిరి పడే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదే పార్టీలో ఒక అన్నయ్య వున్నాడు.నమ్మశక్యం కాలేదు కదా.

 Kcr Called Tdp Leader Kodela As Brother-TeluguStop.com

కానీ ఈ మాట మాత్రం నిజమే! ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ గారే వ్యక్తపరిచారు.అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు కాని దాదాపు అన్న తోనే సమానం అన్న మాట .ఈ మాట చెప్పింది ఎవ్వరో కాదు స్వయానా కేసీఆరే.ఇంతకీ ఆ అన్నయ్య ఎవరో అనే కదా మీ డౌట్ .ఆ వ్యక్తి మరెవరో కాదు.టీడీపీ సీనియర్ నేత – ప్రస్తుత ఏపీ అసెంబ్లీకి స్పీకర్ గా వ్యవహరిస్తున్న కోడెల శివప్రసాద్ రావు

టీఆర్ఎస్ పార్టీని స్థాపించకముందు కేసీఆర్ టీడీపీలో కొనసాగిన విషయం మనందరికీ తెలిసిందే! దీర్ఘకాలం టీడీపీలో వున్న కేసీఆర్.

అప్పటి పలువురు నాయకులతో ఈయనకు సన్నిహిత సంబంధం చాలా బాగానే వుండేది.ఈ నేపథ్యంలోనే ఆయనకు కోడెల శివప్రసాద్ తో బంధం బాగా కుదిరింది.

కోడెల తో తనకు ఉన్న అనుబంధం మూలాన కేసీఆర్ ఎప్పుడూ కోడెల ను అన్నయ్యా అని ప్రేమగా పిలుస్తారట .మొన్న రాజ్ భవన్ లో జరిగిన ముఖ్యమంత్రు ల భేటి లకు స్పీకర్ కోడెల కూడా హాజరయిన సంగతి తెలిసిందే .అయితే ఆ మీటింగ్ లో పాలు మార్లు కేసీఆర్ కోడెల ను అన్నా .అన్నా అని పిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది .పబ్లిక్ మీటింగ్ లలో రెచ్చ గొట్టే ధోరణి తో మాట్లాడే కేసీఆర్ ఒకేసారి అలా పిలవడం చూసి అంతా ఆశ్చర్య పోఆయ్రత

ఒక ముఖ్యమంత్రి హోదాలో వుండి కూడా కేసీఆర్ తన అహంభావాన్ని ప్రదర్శించకుండా పాత విషయాల్ని గుర్తుపెట్టుకుని… తన సీనియర్ నాయకులను అన్నా అని సంబోధించడం సమావేశంలో పాల్గొన్నవారిని ఆయన వ్యక్తిగత విషయం అందరినీ ఆకట్టుకుంది.రాజకీయాల్లో ఎలా ఉన్నా బయట కేసీఆర్ మనస్తత్వం చాలా మంచిదనే చెప్పుకోవాలంటూ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube