కట్టప్ప వల్ల ఇబ్బందుల్లో పడ్డ బాహుబలి

బాహుబలి కర్ణాటకలో 40 కోట్ల షేర్ సాధించింది.కర్ణాటకలో ఇదే ఆల్ టైమ్ రికార్డు.

 Kattappa Creates Hurdles For Baahubali 2 Karnataka Release-TeluguStop.com

కన్నడ సినిమాలు కూడా అంతలా కలెక్ట్ చేయలేదు.ఇక బాహుబలి 2 కర్ణాటకలో 50-60 కోట్ల అవలీలగా సంపాదిస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా.

కాని ఈ 50-60 కోట్లు ఈసారి రావడం అనుమానమే.అసలు బాహుబలి కర్ణాటకలో విడుదల కావడం కూడా అనుమానమే.

ఒకటి కాదు రెండు కాదు 2000 సంఘాలు కలిసి కర్ణాటకలో బాహుబలి విడుదలని అడ్డుకునే ప్లాన్ వేసాయి.వీరు ఇలా పగబట్టడానికి కారణం బాహుబలి కన్నడ సినిమాలన్నీటిని దాటేసిందని కాదు, రాజమౌళి మీద కోపం అంతకన్నా కాదు.

వీరి సమస్య కట్టప్పతో.అంటే కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ తో.

విషయం ఏమిటంటే ఆమధ్య కావేరీ నదీజలాల మీద తమిళనాడుకి – కర్ణాటకకి తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి కదా.ఆ సమయంలో ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సినీతారలు కూడా మాటమాట అనుకున్నారు.ఆ సమయంలోనే సత్యరాజ్ కూడా కర్ణాటక మీద కన్నడ ప్రజల మీద కొన్ని కామెంట్స్ చేసారు.ఆ వ్యాఖ్యలే ఇప్పుడు బాహుబలికి, రాజమౌళికి లేని తలనొప్పి తీసుకొచ్చాయి.

సత్యరాజ్ కారణంగా సినిమాని కర్ణాటకలో విడుదల కానివ్వం అంటున్నాయి కన్నడ సంఘాలు.

అయితే సినిమా సాఫీగా విడుదల కావలంటే సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాలట.

అలా చేస్తేనే బాహుబలి 2 ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా విడుదల అయ్యేది.ఓసారి రజినీకాంత్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసి శివాజీ సినిమాకి అడ్డంకులు సృష్టించుకున్నారు.

అయన కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఆ చిత్రం విడుదలకి నోచుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube