సాధారణంగా ఏ హీరోకు అయినా ఓ సినిమా ప్లాప్ అయ్యిందంటే నెక్ట్స్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ మీద ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది.కానీ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాకు మాత్రం అలాంటి ఎఫెక్ట్ మచ్చుకు అయినా కనిపించదు.
అది పవర్‌స్టార్ క్రేజ్.సర్దార్ రూ.87 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చేస్తే ఆ సినిమాకు కేవలం రూ.52 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.
అయినా ఇప్పుడు పవన్ కొత్త చిత్రం కాటమరాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ములేపుతోంది.ఉగాది కానుకగా ఈ నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న కాటమరాయుడుకు ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్టు ఇండస్ట్రీ ఇన్నర్ వర్గాల టాక్.
కాటమరాయుడు ఏరియా వైజ్ ప్రి రిలీజ్ :
నైజాం – 20 కోట్లు
సీడెడ్ – 12.06 కోట్లు
ఉత్తరాంధ్ర – 8.3 కోట్లు
గుంటూరు – 6 కోట్లు
కృష్ణా – 4.6 కోట్లు
ఈస్ట్ – 5.86 కోట్లు
వెస్ట్ – 4.7 కోట్లు
నెల్లూరు – 2.75 కోట్లు
======================ఏపీ+తెలంగాణ = 64.27 కోట్లు
=======================
కర్ణాటక – 8.2 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 3 కోట్లు
ఓవర్సీస్ – 11.5 కోట్లు ===============టోటల్ = 87 కోట్లు
===============
వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు ఆడియో / వీడియో, శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే టోటల్ కాటమరాయుడ ప్రి రిలీజ్ బిజినెస్ రూ.105 కోట్లు అయినట్టు తెలుస్తోంది.నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పవన్ సన్నిహితుడు శరత్‌మారర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు గోపాల…గోపాల ఫేం డాలి దర్శకత్వం వహిస్తున్నారు.