బాలివుడ్ అగ్రకథానాయిక కరీనా కపూర్ ఏం చేసినా వెరైటిగా ఉంటుంది .స్టార్ డం పీక్స్ లో ఉన్నప్పుడు షాహిద్ కపూర్ లాంటి యంగ్ హీరోతో ప్రేమాయణం నడిపిన కరీనా , ఆ తరువాత తనకంటే వయసులో చాలా పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్ ను పెళ్ళి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
మిగితా కథానాయికలు పెళ్లి చేసుకోగానే సినిమాలు మానేస్తే కరీనా మాత్రం , ఇటు అగ్రకథానాయకులతో , మరోవైపు యువ హీరోలతో జోడి కడుతూనే, ఐటమ్ సాంగ్స్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది .
ఇక కరీనా మరో స్పెషాలిటి సోషల్ మీడియా వాడకపోవడం .అందరిని ఫేస్ బుక్, ట్విట్టర్ లలో నిత్యం బిజీగా ఉంటే , కరీనా మాత్రం వాటిని వాడే ప్రసక్తే లేదు అంటుంది .ఇప్పుడు కరీనా చేస్తున్న మరో వెరైటి పని ఏంటంటే, గర్భాన్ని దాచేయడం .అవును , కరీనా మూడు నెలల గర్భవతి అని బాలివుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది .అలాగని అవకాశాల కోసం గర్భాన్ని దాచేస్తోందని అనుకోకండి .కరీనా ఇంటిముందు ఎప్పుడు దర్శకనిర్మాతల క్యూ ఉంటుంది .
మీడియా హంగామా చేస్తుంది కదా … అందుకే బయటకి చెప్పట్లేదట .ఇదేమి వింత , అందరు హీరోయిన్లు గర్భవతి అయితే స్పెషల్ గా ఫోటోషూట్ చేసి మరి మీడియాకి చెబుతున్నారుగా అని మీరు అనుకుంటున్నారు కాని , కరీనా అంతే , ఏది చేసినా, పబ్లిసిటి మాత్రం కోరుకోదు .చాలా అంటే చాలా వెరైటి .
అన్నట్లు కరీనా గర్భవతి అని ఇంకా ఎవరు ధృవికరించలేదు .ప్రస్తుతానికైతే, మీడియా హంగామా ఇ
.