తాను ఓ "గే" అని ఒప్పేసుకున్న దర్శకుడు

ప్రముఖ బాలివుడ్ దర్శకుడు కరణ్ జోహర్ కి ఇంతవరకు పెళ్ళి కాలేదు.అందరు హీరోయిన్లతో బాగా క్లోజ్ గా మూవ్ అవుతాడు కాని, ఎవరితోనూ ప్రేమాయణం నడపలేదు.

 Karan Johar Admits That He Is A “gay”-TeluguStop.com

కనీసం ఓ రూమార్ కూడా లేదు.అందుకే కరణ్ జోహర్ స్వలింగ సంపర్కుడని చాలా వార్తలు వచ్చేవి.

కాని ఆ దర్శకుడు ఎప్పుడూ ఖచ్చతత్వంతో స్పందించలేదు.మొత్తానికి, ఇన్నాళ్ళకు ఒప్పేసుకున్నాడు, తాను ఓ గే అని.

భారతదేశంలో ఉన్న హోమోఫోబియా (స్వలింగ సంపర్కుల పట్ల అయిష్టత) గురించి మాట్లాడిన కరణ్ జోహార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు.తాను ఓ స్వలింగ సంపర్కుడినని ఇండైరెక్ట్ గా ఒప్పేసుకున్నాడు.

“నా సెక్సువల్ ఓరియెంటేషన్ ఏంటో అందరికి తెలుసు.నేను దాన్ని (గే అనే విషయాన్ని) అరుస్తూ బయటపెట్టాల్సిన అవసరం లేదు.

నేను చెప్పాలనుకున్నా, నేను చెప్పలేను.ఎందుకంటే నేను బ్రతుకుతున్న దేశంలో ఆ మాటలకి నన్ను జైలులో పెట్టినా పెడతారు.

అందుకే నా గురించి అందరికి తెలిసిన విషయాన్ని కూడా నేను నా నోటితో బయటపెట్టలేను.ఈ హోమోఫోబియా అనేది హృదయానికి బాధను కలిగిస్తుంది” అంటూ చెప్పాల్సిన విషయం చెప్పకనే చెప్పాడు కరణ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube