బాలివుడ్ అగ్రనటి కంగనా రనౌత్ ఎంత ముక్కుసూటి మనిషో మనందరికి తెలిసిందే.తొలినాళ్ళలో అవకాశాల కోసం శారీరక సంబంధాలు పెట్టుకున్నానని ఒప్పుకోవడం, తానే కాదు, చాలామంది బాలివుడ్ టాప్ హీరోయిన్లు తమ శరీరాన్ని అర్పించినవారే అంటూ సంచలన వ్యాఖ్యాలు చేయండి, పూర్తి టాప్ లెస్ గా రెండుసార్లు నటించడం, హృతిక్ రోషన్ తో ఎఫైర్ .
ఒకటా రెండా కంగనా కెరీర్లో ఎన్నో వివాదాలు.
అన్ని ఒప్పేసుకుంటుంది.
ఏది దాచుకోదు.తను కన్యత్వాన్ని కోల్పోవడం గురించి తన తల్లిదండ్రులు బాధపడుతున్నారని ఇప్పుడో మరో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
“ఎవరి తల్లిదండ్రులైనా సరే, తమ కూతురు పెళ్ళి జరక్కముందే కన్యత్వాన్ని కోల్పోకూడదని కోరుకుంటారు.నా పాత ఎఫైర్ల గురించి మాట్లాడిన ప్రతీసారి నేను కన్యని కానందుకు వారు చాలా బాధపడతారు.
కాని ఆ విషయాన్ని నాకు డైరెక్టుగా చెప్పరు” అంటూ తన తల్లిదండ్రుల బాధను బయటపెట్టింది కంగనా.
దీన్ని ముక్కుసూటితనం, నిర్మొహమాటం అని కంగనా అభిమానులు అంటుంటే, మరికొందరు బాలివుడ్ జనాలు మాత్రం కంగనా పద్ధతులని తప్పుపడుతున్నారు.
మరీ ఓవర్ యాక్షన్ చేస్తోందని అభిప్రాయపడుతున్నారు.