‘ముని’, ‘కాంచన’ సినిమాల తర్వాత అదే క్రమంలో రాబోతున్న సినిమా ‘కాంచన`2’.దాదాపు రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాను ఎట్టకేలకు పూర్తి చేశాడు దర్శకుడు రాఘవ లారెన్స్.
ఈయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈనెల 17న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తాప్సి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో హీరోయిన్ నిత్యామీనన్ నటించిన విషయం తెల్సిందే.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.దాంతో సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్దం అవుతున్నారు.
గతంలో వచ్చిన ‘ముని’ మరియు ‘కాంచన’ సినిమాలు ప్రేక్షకులను భయపెట్టడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి.ఆ సినిమాలకు మించి ఈ సినిమా డబుల్ భయపెట్టడం ఖాయం అంటూ దర్శకుడు లారెన్స్ మొదటి నుండి కూడా చెబుతున్నాడు.
అన్నట్లుగానే ఈ సినిమాను భయంకరంగా చిత్రీకరించాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని నిర్మాత బెల్లంకొండ సురేష్ అంటున్నాడు.
తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈ సినిమా విడుదల కానుంది.కమల్ ‘ఉత్తమ విలన్’ విడుదల వాయిదా పడటంతో అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.