సౌత్ ఇండియా స్టార్ హీరో, యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ మాజీ భార్య సారిక.వీరిద్దరి ప్రేమకు గుర్తుగా శృతిహాసన్ మరియు అక్షర హాసన్‌లు ఉన్నారు.
సారికతో విడిపోయిన తర్వాత కమల్ గౌతమితో సహ జీవనం చేస్తున్న విషయం తెల్సిందే.అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? విషయానికి వస్తే మాజీ భార్య భర్తలు ఎదురు పడితే తల తిప్పుకోవడం చేస్తారు.కాని ఇక్కడ కమల్, సారికలు అలా కాకుండా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చారు.
కమల్, సారికల చిన్న కూతురు అక్షర హాసన్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం ‘షమితాబ్’.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
అయితే అక్కడ గౌతమి కూడా ఉంటే బాగుండేదని అక్కడే ఉన్న మీడియా మిత్రులు గుసగుసలాడుకున్నారు.