కమల్‌ స్పీడే స్పీడు

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సక్సెస్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నాడు.ఇటీవలే ‘ఉత్తమ విలన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్‌ నటించి మరో రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.‘విశ్వరూపం`2’ మరియు ‘పాపనాశనం’ సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి.ఈ రెండు సినిమాలు విడుదలకు ఉండగానే కమల్‌ మరో సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యాడు.

 Kamal Haasans Next Titled Thoongaavanam-TeluguStop.com

తెలుగు మరియు తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు తమిళంలో ‘తుంగావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.తెలుగులో కూడా అతి త్వరలో టైటిల్‌ ఫిక్స్‌ చేయబోతున్నారు.

చాలా కాలం తర్వాత కమల్‌ తెలుగులో నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఈ సినిమాను హైదరాబాద్‌ మరియు చెన్నైలలో చిత్రీకరించబోతున్నాడు.

ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో మే 24న జరుపనున్నారు.ఆ వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ను మే 25 నుండి ప్రారంభించనున్నారు.

సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా మే 25న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని కమల్‌ భావిస్తున్నాడు.

థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాతో రాజేష్‌ సెల్వ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.ఈ సినిమాను కమల్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు.

కమల్‌ ఈ స్పీడ్‌ చూసి ఇరత హీరోలు జలసీ ఫీల్‌ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube