తెలుగమ్మాయితో ముద్దు సీన్లో కమల్ హాసన్

ముద్దు సన్నివేశాలు అంటే మనకి గుర్తొచ్చే పేరు కమల్ హాసన్.బాలివుడ్ లో ఇమ్రాన్ హాష్మి ముద్దు ముచ్చట్లు మొదలవడానికి దశాబ్దం ముందే భారత వెండితెరపై ముద్దు సన్నివేశాల్ని పాపులర్ చేసారు కమల్.

 Kamal Haasan And Madhushalini Kissed For Cheekati Rajyam-TeluguStop.com

ఆయన సినిమా అంటే ఖచ్చితంగా కిస్సింగ్ సీన్ ఉండాల్సిందే.అంతగా అలవాటు చేసారు.

కమల్ తదుపరి చిత్రం చీకటి రాజ్యంలో ( తమిళంలో తుంగవనం ) ఘాటైన ముద్దు సన్నివేశం ఉందట.

అయితే ఈ ముద్దు సన్నివేశం కమల్-త్రిష ల మధ్య కాదు.

కమల్ పెదవులు కలిపింది మన అచ్చ తెలుగమ్మాయి మధుశాలినితో.కితకితలు,గోపాల గోపాల చిత్రాల్లో మంచి పాత్రలు పోషించిన మధుశాలిని చీకటిరాజ్యంలో ఓ కీలక పాత్ర చేసింది.

కథలో భాగంగా కమల్-మధుశాలినిల మధ్య కాస్త పెద్దగానే ఉండే చుంబన దృశ్యాన్ని చిత్రీకరించారట.అయితే అది సినిమాలో ఉంటుందా , ఉండదా అనేది ఇంకా అనుమానంగానే ఉంది.

ఆ సన్నివేశం మరీ హాట్ గా ఉండటంతో సెన్సార్ సభ్యులు అయితే నిడివి తగ్గించవచ్చు, లేదా పూర్తిగా తీసేయవచ్చు అని స్వయంగా కమల్ హాసనే చెప్పారు.అంతలా అనుమానపడుతున్నారంటేనే మనం ఊహించుకోవచ్చు, ఆ సన్నివేశం ఎంత ఘాటుగా ఉంటుందో.

త్వరలో సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనున్న చీకటిరాజ్యం ఇదే నెల 20వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రాన్ని ఫ్రెంచి చిత్రం ” స్లీప్ లెస్ నైట్ ” ఆధారంగా తెరకెక్కించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube