ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో 100వ సినిమా?

నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన ‘లయన్‌’ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది.‘లయన్‌’ సినిమాతో బాలయ్య 98 సినిమాలను పూర్తి చేసుకున్నాడు.

 Kalyan Ram To Produce Balakrishna’s 100th Movie-TeluguStop.com

ఇక బాలయ్య 99వ సినిమాను ఇప్పటికే శ్రీవాస్‌ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి.

స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయిన ఈ సినిమాను వచ్చే నెలలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు.ఇక ఆ తర్వాత బాలయ్య తన ప్రతిష్టాత్మక చిత్రం అయిన 100వ సినిమాలో నటించనున్నాడు.

ఇప్పటికే 100వ సినిమా గురించి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని, ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించనుందని, ఈ సినిమాకు టైటిల్‌గా ‘చరిత్రకు ఒక్కడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా ఈ సినిమాను ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మించే అవకాశాలున్నాయి అని అంటున్నారు.గతంలో కళ్యాణ్‌ రామ్‌ కూడా బాలయ్య బాబాయి 100వ సినిమాను నిర్మించే అవకాశం తనకు రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు బాలయ్య తన 100వ సినిమా నిర్మాణ బాధ్యతలను కళ్యాణ్‌ రామ్‌కు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube