కళ్యాణ్ రామ్ అప్పులు ఎప్పుడు తీరుతాయి? -Kalyan Ram Still In Huge Debts? 3 months

Kalyan Ram Still In Huge Debts? Low Budget NTR Arts Banner Puri Jagannath Share Photo,Image,Pics-

కళ్యాణ్ రామ్ గత సంవత్సరం పటాస్ లాంటి భారీ బ్లాక్బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన షేర్ నిరుత్సాహపరిచినా, పూరి జగన్నాథ్ “ఇజం” తో మారోసారి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే సినిమాతో బాక్సాఫిసు బరిలో దిగుతున్నాడు. ఈ సినిమా హిట్ అయినా, ఫట్ అయినా, ఇప్పటికిప్పుడు కళ్యాణ్ రామ్ కెరీర్ కి వచ్చే ప్రమాదం ఏమి లేదు. అయితే, సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కళ్యాణ్ రామ్ ఆర్థికంగా మాత్రం చిక్కుల్లో ఉండటం ఖాయమని చెబుతున్నారు ట్రెడ్ విశ్లేషకులు.

పటాస్ లాంటి భారి హిట్ తరువాత కూడా కళ్యాణ్ రామ్ సొంత సంస్థ యన్.టి.ఆర్ ఆర్ట్స్ అప్పుల్లోనే ఉందట. దానికి కారణం అంతకుముందు తన నిర్మాణంలో వచ్చిన సినిమాలు విఫలమవడం. ఇప్పుడు ఇజంతో కూడా ఆ అప్పులు తీరే పరిస్థితులు కనబడటం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని టాక్. సినిమాకి పెట్టినంత బిజినెస్ రాబట్టలేదట ఇజం.

అంటే మళ్ళీ చేతిలో అప్పులు పెట్టుకోని ఇజంని విడుదల చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. సినిమాని ఔట్ రైట్ బెసీస్ లో అమ్మేసి ఉంటే, సినిమా హిట్ అయినా కళ్యాణ్ రామ్ జేబులోకి ఏం వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. మరి కళ్యాణ్ రామ్ అప్పులు ఎప్పుడు తీరుతాయో ! దీనికి ఒకటే మార్గం .. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎన్టీఆర్ తో ఓ సినిమా నిర్మించడమే.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శృతి హాసన్ - సమంతల మధ్య "ప్రేమ" గొడవలు ?

About This Post..కళ్యాణ్ రామ్ అప్పులు ఎప్పుడు తీరుతాయి?

This Post provides detail information about కళ్యాణ్ రామ్ అప్పులు ఎప్పుడు తీరుతాయి? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Kalyan Ram still in huge debts?, Kalyan Ram, ISM, Puri Jagannath, Share, NTR Arts Banner, Low Budget

Tagged with:Kalyan Ram still in huge debts?, Kalyan Ram, ISM, Puri Jagannath, Share, NTR Arts Banner, Low Budgetism,kalyan ram,Kalyan Ram still in huge debts?,Low Budget,NTR Arts banner,puri jagannath,share,,