ఇజం కథ అలా ఉండదంట-Kalyan Ram Clarifies On ISM Story Rumours 3 months

Journalism Kalyan Ram Kalyan Clarifies On ISM Story Rumours Panama Papers Puri Jagannath Photo,Image,Pics-

ఈమధ్యకాలంలో చూస్తే, పూరి జగన్నాథ్ తన సినిమాల్లో ఏదో ఓ సామాజిక అంశాన్ని లేవదీస్తున్నారు. బిజినెస్ మెన్ లో క్రైమ్ రేట్ తగ్గించేస్తే, కెమెరామెన్ గంగతో రాంబాబులో విభజన రాజకీయాలపై అస్త్రాన్ని సంధించారు. టెంపర్ లో రేప్ దోషులపై దండయాత్ర, జ్యోతిలక్ష్మీలో ఓ వేశ్య పోరాటం .. ఇలా పూరి ప్రతి సినిమాలో ఒక సోషల్ టాపిక్ తో వస్తున్నారు. అదే బాటలో ఇజం సినిమా కోసం ఆమధ్య సంచలనంగా నిలిచిన పనామా పేపర్స్ వివాదాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారని వార్తలొచ్చాయి.

జర్నలిజంపై సెటైర్లు ఉంటాయని, కళ్యాణ్ రామ్ పనామా పేపర్స్ అక్రమాలపై పోరాటం చేస్తారని, ఇదే ఈ చిత్రం యొక్క కథ అని ఊహాగానాలు వినిపించాయి. కాని అవన్ని రూమర్స్ అని కళ్యాణ్ రామ్ కొట్టిపారేశారు. పనామా పేపర్స్ వివాదానికి ముందే ఈ కథ ఫైనలైజ్ అయ్యిందని, ఆ బ్లాక్ మని వివాదంపై ఈ సినిమా కథ ఆధారపడిలేదని కళ్యాణ్ రామ్ ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అలాగే సాయిధరమ్ తేజ్ తో సినిమాకి ఇంకా కథ సిద్ధం కాలేదని, టైటిల్ “రామకృష్ణ” కాదని స్పష్టీకరించారు కళ్యాణ్ రామ్.

ఇక ఇజం విషయానికి వస్తే, ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మాజీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ విజేత అదితి ఆర్య హీరోయిన్ గా నటించింది. ఆక్టోబర్ 21వ తేదిన ఈ చిత్రం విడుదల కానుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..ఇజం కథ అలా ఉండదంట

This Post provides detail information about ఇజం కథ అలా ఉండదంట was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Kalyan Ram clarifies on ISM story rumours, Kalyan Ram, ISM Movie, Puri Jagannath, Journalism, Panama Papers

Tagged with:Kalyan Ram clarifies on ISM story rumours, Kalyan Ram, ISM Movie, Puri Jagannath, Journalism, Panama PapersIsm Movie,journalism,kalyan ram,Kalyan Ram clarifies on ISM story rumours,Panama Papers,puri jagannath,,