గుడ్ సినిమా గ్రూప్ చిత్రం " క‌ళావ‌తి "

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌య్యి ఇప్ప‌డు అర‌ణ్మ‌యి 2 గా ఇప్ప‌టికే త‌మిళ‌నాట సంచ‌ల‌నాన్ని క్రియెట్ చేస్తున్న చిత్రానికి తెలుగులో క‌ళావ‌తి అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.ఈ చిత్ర హక్కులు ఫ్యాన్సీ రేట్ ఇచ్చి సర్వంత్రామ్‌ క్రియేషన్స్ మ‌రియు ఈరోజుల్లో, రోమాన్స్ లాంటి ప‌లు విజయవంతమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్ దక్కించుకున్నారు.

 Kalavati – Trisha & Siddharth New Film-TeluguStop.com

ఈ రెండు బ్యానర్స్ సంయుక్తంగా క‌ళావ‌తి ని త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

శ్రీ జవ్వాజి రామాంజనేయులు చిత్ర స‌మ‌ర్ప‌కులు, ఈ చిత్రంలో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు.

హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.హిప్ హాప్ తమీఝా సంగీతమందించారు.ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ….సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న క‌ళావ‌తి చిత్రం హార్రర్ కామెడీ చిత్రాల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా తెలుగు రికార్డులు సృష్టుంది.

మా సంస్థలైన గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్రమ్ క్రేయేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ చిత్రాన్ని సైతం భారీ పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకురాబోతున్నాం.

సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా పెర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది.అద్భుతమైన గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ అవుతారు.ఈ చిత్రం మెద‌టి భాగం కంటే మా క‌ళావ‌తి లో రెండింత‌లు ఎంటర్ టైన్ మెంట్ ను దర్శకుడు అందించబోతున్నారు.చిత్రం మెద‌టి లుక్ ని విడుద‌ల చేశాము.

త్వ‌ర‌లో ట్రైల‌ర్ ని విడుద‌ల‌చేసి హిప్ హాప్ మ్యూజిక్ ని జ‌న‌వ‌రి మూడ‌వ వారంలో విడుద‌ల చేస్తాము, రీ రికార్డింగ్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలం.అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వరి నెలాఖ‌రున చిత్రాన్ని విడుద‌ల చేస్తాము.అని అన్నారు.

  • సమర్పణ – శ్రీ జవ్వాజి రామాంజనేయులు
  • నటీనటులు – సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై సరళ, రాధా రవి
  • సంగీతం – హిప్ హాప్ తమిఝా
  • దర్శకుడు – సుందర్ సి
  • నిర్మాత – గుడ్ ఫ్రెండ్స్
  • .

    Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

    తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

    ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
    Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube