టీవీ లేని అబ్దుల్‌ కలాం

మన మధ్య నుంచి వెళ్లిపోయిన మాజీ రాష్ర్టపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం నిరాడంబర జీవితం గురించి కొద్దిమందికైనా తెలిసివుంటుంది.ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయన సొంతం.

 Kalam Never Had A Tv At Home-TeluguStop.com

అవివాహితుడు.నిరాడంబరుడు.

సంగీత ప్రియుడు.పుస్తకాల పురుగు.

నిత్య విద్యార్థి.జ్ఞాన సంపన్నుడు.

యువతకు స్ఫూర్తిదాయకుడు.అలుపెరగని బోధకుడు….

ఆయన్ని గురించి ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు.మన రాజకీయ నాయకులు ఆయన్ని రాష్ర్టపతిని చేశారుగాని నిజానికి ఆ పదవిపై ఆయనకు ఆసక్తి లేదు.

తాను టీచర్‌గానే ఉండటానికి ఇష్టపడతానని ఆయన అనేకసార్లు చెప్పారు.ఆయన నిరాడంబరత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

టీవీ లేనిదే పొద్దుగడవని ఈ కాలంలోకలాం ఇంట్లో టెలివిజన్‌ లేదు.నిజంగా ఇది ఆశ్చర్యమే కదా….! టీవీ, సెల్‌ఫోన్‌ లేకపోతే పిచోళ్ల కింద జమచేసే ఈ రోజుల్లో రాష్ర్టపతిగా పనిచేసిన, అణ్వస్ర్త శాస్ర్తవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన, మిస్సైల్‌ మేన్‌గా భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి ఇంట్లో టీవీ లేకపోవడం విచిత్రం కదూ….! ఆయన రేడియో మాత్రమే వింటారు.

అది కూడా ఆలిండియా రేడియో వార్తలు మాత్రమే వింటారు.ఆయన కన్నుమూసేంత వరకు ఆరోగ్యం బాగుంది.

కలాం పెద్దన్నయ్య ఇంకా జీవించే ఉన్నారు.ఆయనకు ప్రస్తుతం తొంభైతొమ్మిదేళ్లు.

ఈ వయసులో తమ్ముడి మరణం ఆయనకు గుండెకోత అని చెప్పకతప్పదు.కలాం ఎంత గొప్ప వ్యక్తంటే ఆయనకు సంగీతమంటే ఇష్టం కాబట్టి ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు ఎంఎస్‌ సుబ్బులక్ష్మిని తనకు తల్లిగా చెప్పుకున్నారు.

ఆమె స్ఫూర్తితో వీణ నేర్చుకున్నారు.ఆయనకు మానవ సేవ అంటే ఇష్టం కాబట్టి మదర్‌థెరిస్సాను మరో తల్లిగా చెప్పుకున్నారు.

ఇలాంటివారు అరుదుగా జన్మిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube