వారికి కాకుండానే నాకా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ పెళ్లి గురించి మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈమె సోదరి నిషా అగర్వాల్‌ కొంత కాలం క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

 Kajal Serious Response Over Marriage Issue-TeluguStop.com

అప్పటి నుండి కూడా కాజల్‌ పెళ్లి చేసుకోబోతుంది అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.అయితే వాటిని ఎప్పుడు ఖండిస్తూ వస్తూనే ఉంది.

తాజాగా మరోసారి కాజల్‌ పెళ్లి వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి.దాంతో ఈసారి కాజల్‌ కాస్త సీరియస్‌గానే స్పందించింది.

తన పెళ్లి గురించి మీకు ఏంటి తొందర అంటూ మీడియా వారిని ప్రశ్నిస్తోంది.

నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పుడు లేదు.

అలాంటప్పుడు మీకు ఎందుకు నా పెళ్లి గురించి అంటూ కాజల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.సినిమాలు తక్కువ అయిన సమయంలో పెళ్లి చేసుకుంటుందని భావించిన కాజల్‌ ఇంకా పెళ్లి ఆలోచన తనకు లేదు అంటూ తేల్చి చెప్పింది.

అయినా తన కంటే సీనియర్‌లు అయిన అనుష్క, త్రిష, నయన్‌లు పెళ్లి చేసుకోకుండానే ఇప్పుడిప్పుడే వచ్చిన నేను పెళ్లి చేసుకోవాలా అంటూ కాజల్‌ మీడియాను ప్రశ్నించింది.తన మనస్సుకు నచ్చిన వాడు ఇంకా తారస పడలేదు అని, తారస పడ్డ సమయంలో తప్పకుండా పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube