ఆ హీరోతో రోమాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదు అంటున్న కాజల్

సీనియర్ హీరో ఓ వయసుకి వచ్చాక కుర్ర హీరోయిన్లతో డ్యూయెట్లు పాడటం చూడడానికి కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది.అలాగే హీరోయిన్లకు కూడా అదో విచిత్రమైన అనుభవంలా అనిపిస్తూ ఉండవచ్చు.కాని మెగాస్టార్ తో రోమాన్స్ చేయడం అస్సలు ఇబ్బందకరంగా అనిపించలేదు అని అంటోంది ముద్దుగుమ్మ కాజల్.

 Kajal Aggarwal Wasn’t Hesitant To Romance Chiranjeevi-TeluguStop.com

” ఒక నటిగా, అది నా బాధ్యత.ఒక్కసారి సినిమా ఒప్పుకున్న తరువాత నా పని నేను చేయాలి.ఒక్కసారికథ నచ్చితే, నా దృష్టి అంతా నా నటన, పాత్ర మీదే ఉంటుంది.చిరంజీవి గారితో నటించడానికి నేనెప్పుడు వెనకడుగు వేయలేదు.ఆయనతో నటించడం అధ్బుతమైన అనుభవం.

రేపు ప్రేక్షకులు మా జోడిని తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను” అంటూ మెగాస్టార్ తో నటిస్తున్న అనుభవాల్ని చెప్పుకుంది కాజల్.

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖైది నం.150 ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.సంక్రాంతి కానుకగా ఈ “కత్తి” రీమేక్ ప్రేక్షకుల ముందుకి రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube