ఇప్పుడు అక్కడ ఆ సర్జరీ ఎందుకు కాజల్ ?

కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం అవుతోంది.ఇన్నేళ్ళు ఒక స్టార్ హీరోయిన్ గా చెలామణి అవడం, ఈతరం స్టార్ హీరోలందరితో నటించడం, మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేయడం, సమంత, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా, పూజ హెగ్డే లాంటి అందాలను తట్టుకొని ఇంకా అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం నిజంగా పెద్ద విషయమే.

 Kajal Agarwal To Undergo A Surgery To Look More Young ?-TeluguStop.com

గత ఏడాది మహేష్ – పవన్ లతో సినిమాలు చేసిన కాజల్ ఈ ఏడాది తమిళంలో అదే రేంజి హీరోలు విజయ్ – అజిత్ లతో సినిమాలు చేస్తోంది.అది మరి కాజల్ మ్యాజిక్ అంటే … ఆ మ్యాజిక్ డోసు మరింతగా పెంచే ఆలోచనలో ఉందట కాజల్.

సర్జరీ చేయించుకొని ఇంకా యంగ్ గా, ఇంకా అందంగా కనబడాలి అనుకుంటుందట.

ఇప్పుడొస్తున్న కుర్ర కథానాయికల స్పీడు చూస్తోంటే కాజల్ హవా త్వరలోనే తగ్గేలా ఉంది.

తనకన్నా లేటుగా వచ్చి, తనకన్న ఎక్కువ పారితోషికం అందుకుంటున్న కథానాయికలు ఇప్పటికే ఉన్నారు.పూజ హెగ్డేనే తీసుకోండి.

అప్పుడే కోటిన్నర తీసుకుంటోంది.ఉగిసలాటలో ఉన్న మహేష్ బాబు సినిమా ఛాన్స్ దొరికేస్తే పూజ రేటు ఇంకా పెరుగుతుంది.

అలాగే అవకాశాలు పెరుగుతాయి.అందుకే, ఇలాంటి వారి స్పీడు తట్టుకునేందుకే కాజల్ మళ్ళీ సర్జరీ చేయించుకోనుందట.

ఇప్పటికే తన ముక్కుకి కాజల్ సర్జరీ చేయించుకుందని టాక్.

బరువు తగ్గి, నడుము అందాలను ఇంకాస్త సన్నగా మార్చుకున్న కాజల్, ముఖానికి మరొక సర్జరీ చేయించుకోనుందని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఎప్పుడు ఒకేలా ఉంటే ప్రేక్షకులకి బోర్ కొడతానని, ఇప్పటికే దశాబ్దకాలంగా తనని చూస్తున్నారని, కొంచెం లుక్ మార్చితే ఫ్రెష్ ఫీల్ వస్తుందని కాజల్ భావిస్తోందట.మరి ఆ సర్జరీ ఎదో బాగా జరిగితే మంచిదే కాని కత్రీనా కైఫ్ కి తేడా కొట్టినట్టు తేడా కొడితే అందమైన ముఖాన్ని పాడుచేసుకున్నట్లు అవుతుంది.

సినిమాల గురించి మాట్లాడుకుంటే తమిళంలో మేర్సల్, వివేగం చిత్రాలు చేస్తున్న కాజల్, తేజ దర్శకత్వంలో రానాతో “నేనే రాజు నేనే మంత్రి” సినిమాని పూర్తి చేసింది.కళ్యాణ్ రామ్ ప్రారంభించిన MLA – మంచి లక్షణాలున్న అబ్బాయిలో కూడా ఈ అమ్మడే కథానాయిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube