Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఇప్పుడు అక్కడ ఆ సర్జరీ ఎందుకు కాజల్ ?-Kajal Agarwal To Undergo A Surgery To Look More Young ?

కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం అవుతోంది. ఇన్నేళ్ళు ఒక స్టార్ హీరోయిన్ గా చెలామణి అవడం, ఈతరం స్టార్ హీరోలందరితో నటించడం, మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా ఓ సినిమా చేయడం, సమంత, రకుల్ ప్రీత్, రాశి ఖన్నా, పూజ హెగ్డే లాంటి అందాలను తట్టుకొని ఇంకా అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం నిజంగా పెద్ద విషయమే. గత ఏడాది మహేష్ – పవన్ లతో సినిమాలు చేసిన కాజల్ ఈ ఏడాది తమిళంలో అదే రేంజి హీరోలు విజయ్ – అజిత్ లతో సినిమాలు చేస్తోంది. అది మరి కాజల్ మ్యాజిక్ అంటే … ఆ మ్యాజిక్ డోసు మరింతగా పెంచే ఆలోచనలో ఉందట కాజల్. సర్జరీ చేయించుకొని ఇంకా యంగ్ గా, ఇంకా అందంగా కనబడాలి అనుకుంటుందట.

ఇప్పుడొస్తున్న కుర్ర కథానాయికల స్పీడు చూస్తోంటే కాజల్ హవా త్వరలోనే తగ్గేలా ఉంది. తనకన్నా లేటుగా వచ్చి, తనకన్న ఎక్కువ పారితోషికం అందుకుంటున్న కథానాయికలు ఇప్పటికే ఉన్నారు. పూజ హెగ్డేనే తీసుకోండి. అప్పుడే కోటిన్నర తీసుకుంటోంది. ఉగిసలాటలో ఉన్న మహేష్ బాబు సినిమా ఛాన్స్ దొరికేస్తే పూజ రేటు ఇంకా పెరుగుతుంది. అలాగే అవకాశాలు పెరుగుతాయి. అందుకే, ఇలాంటి వారి స్పీడు తట్టుకునేందుకే కాజల్ మళ్ళీ సర్జరీ చేయించుకోనుందట. ఇప్పటికే తన ముక్కుకి కాజల్ సర్జరీ చేయించుకుందని టాక్.

Continue Reading
More Posts
To Top