ముద్దు తెలిసే పెట్టానంటున్న కాజల్

కాజల్ అగర్వాల్ నటిస్తున్న హిందీ చిత్రం “దో లఫ్జో కి కహాని”.రణదీప్ హూడా హీరోగా నటిస్తున్నాడు.

 Kajal Agarwal Reveals Everything About Kiss With Randeep Hooda-TeluguStop.com

ఈ చిత్రంలో మొదట ముద్దు సన్నివేశాలు లేవని, అనుకోకుండా రణదీప్ కాజల్ ని ముద్దు పెట్టుకోవడంతో ఆ సన్నివేశాన్ని అలానే ఉంచేసారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.దీన్ని కాజల్ ఖండించింది.స్క్రిప్టులో ముద్దు సన్నివేశం ఎప్పటినుంచో ఉందని తెలియజేసింది.

” లిప్ లాక్ సన్నివేశం కథలో మొదటినుంచి ఉంది.మొదట నాకు చేయాలా వద్ద అన్న స్పష్టత లేకపోయినా, నా క్యారెక్టర్ ని, కథలో ఆ సన్నివేశానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాను.ప్రేమను తెలియజేసే అతిముఖ్య మార్గం స్పర్షే.

నేను పోషించిన గుడ్డి అమ్మాయి పాత్రకి స్పర్ష లేకుండా ప్రేమ తెలియజేయటం ఇంకా కష్టం.తనెప్పుడూ ఆ అబ్బాయిని చూడలేదు.

కేవలం తాకి ఫీల్ అవగలదు అంతే.అందుకనే అక్కడ ముద్దు సీన్ ఉండటం అర్థవంతమైన విషయం.

లిప్ లాక్ సడెన్ గా జరగలేదు ” అంటూ చెప్పుకొచ్చింది కాజల్.

దో లఫ్జో కి కహాని జూన్ 10న విడుదలకు సిద్ధమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube