పవన్‌ ఈమెకూ నచ్చాడు!

పవన్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఎవరికైనా నచ్చాల్సిందే.ముఖ్యంగా ఆయనతో వర్క్‌ చేసే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను అభిమానిస్తారు.

 Kajal Praises Pawan-TeluguStop.com

తెలుగు హీరోల్లో అత్యధిక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో పవన్‌ ముందు ఉంటాడు.ఈయన తన నటనతోనే కాకుండా తన స్వభావం, ప్రవర్థనతో కూడా ఎంతో మందిని ఫ్యాన్స్‌గా చేసుకున్నాడు.

తాజాగా ఈయన హీరోయిన్‌ కాజల్‌ను కూడా తన అభిమానిగా మార్చేసుకున్నాడు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌, కాజల్‌ జంటగా ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా షూటింగ్‌ కోసం తాజాగా కాజల్‌ పవర్‌ స్టార్‌ను కలిసింది.వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ గురించి తెలుసుకున్న కాజల్‌ సోషల్‌ మీడియాలో తెగ పొగడుతూ ట్వీట్‌ చేసింది.తాను గతంలో పలు సార్లు పవన్‌ గొప్పదనం చూశాను కాని ఇప్పుడు ఆయన్ను దగ్గర నుండి చూస్తుంటే గర్వంగా ఉంది.

డౌన్‌ టు ఎర్త్‌ వ్యక్తుల గురించి వినడమే కాని ఇప్పటి వరకు చూసింది లేదు.ఆ లోటు పవన్‌ కళ్యాణ్‌ను చూసిన తర్వాత పోయింది అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది.

మొత్తానికి కాజల్‌ను కూడా పవన్‌ తన బుట్టలో వేసేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube