ఎన్టీఆర్ తో మాత్రమే ఆ పని చేసిన కాజల్ .. కేవలం ఎన్టీఆర్ కోసమే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన సినిమా కెరీర్ మొదలుపెట్టి 16 సంవత్సరాలు అవుతున్నాయి.ఇంత పెద్ద కెరీర్ లో 20 మందికి పైగా హీరోయిన్లతో పనిచేసాడు ఎన్టీఆర్.

 Kajal Agarwal Did That Only For Ntr-TeluguStop.com

కాని ఏనాడైనా, ఏ హీరోయిన్ తో అయినా ఎన్టీఆర్ ప్రవర్తన గురించి చెడుగా విన్నామా? ఇక్కడే అర్థం చేసుకోండి ఎన్టీఆర్ తన హీరోయిన్లతో ఇటు ఫ్రెండ్లీగా ఉంటూనే, ఎంత మర్యాదపూర్వకంగా ఉంటాడో.అందుకే ఎన్టీఆర్ తో రెండేసి, మూడేసి సినిమాలు చేయగలిగారు కాజల్, సమంత.

అందుకే ఎన్టీఆర్ కోసం ఐటమ్ సాంగ్ చేసానంటోంది కాజల్.

ఈ ముద్దుగుమ్మ జనతా గ్యారేజ్ లో “పక్కా లోకల్” అంటూ ఎన్టీఆర్ తో చిందులేసి థియేటర్లను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత కాజల్ కి ఐటమ్ సాంగ్ ఆఫర్స్ ఎన్నో వచ్చాయట.తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చాలామంది తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేయమని అడిగారట.

బాలివుడ్ లో అయితే ఒక పెద్ద హీరో ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించినా, అందరికి కాజల్ నో చెప్పేసింది.

మరి జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ ఎందుకు చేసినట్టు అని అడిగితే తారక్ కోసమే అంటోంది.

ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం వలనే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కి చిందులేసానని, కాని ఇంకెవరు ఐటమ్ సాంగ్ కోసం అడిగినా అంత ఈజీగా ఒప్పుకోనని అంటోంది కాజల్.మరి ఇకపై ఐటమ్ సాంగ్ అస్సలు చేయదా అంటే అలా కూడా కాదు.

ముందు తనకి ఐటమ్ సాంగ్ చేయాలి అనిపించాలట.ఆ తరువాత సినిమా ఏంటి, సినిమాలో ఐటమ్ సాంగ్ ఎప్పుడొస్తుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ చిత్రీకరిస్తారు, ఎలాంటి బట్టలు డిజైన్ చేస్తారు, సినిమా హీరో ఎవరు, దర్శకుడు ఎవరు .ఈ విషయాలన్నీ పరీశీలించిన తరువాతే ఓ నిర్ణయం తీసుకుంటుందట ఈ 31 ఏళ్ళ సుందరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube