అలా తెల్ల గడ్డంతో స్టయిలిష్ గ్లాసులు పెట్టుకునే సరికి, తలైవా అంటూ దేశమంతా నినాదాలు చేసింది.కబాలి ఫస్ట్ లుక్ మొదలు, ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు.
గ్యాంగ్ స్టర్ రోల్ అని తెలిసేసరికి ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి.ఇక టీజర్ విడుదల అయ్యాక, అభిమానులు, ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
హైప్ దొరికింది కదా అని, సాటిలైట్ కలుపుకోని 200 కోట్లకి అమ్మేసాడు నిర్మాత.
సినిమాకి మొదటిరోజే నెగెటివ్ టాక్ వచ్చింది.
వచ్చిన రివ్యూలని నమ్మలేదో, లేక రజినికాంత్ ని ఓసారి చూడాల్సిందే అని బయలుదేరారో కాని, మొదటి మూడు రోజులు కుప్పులుకుప్పలుగా కలెక్షన్లు ఇచ్చేసారు ప్రేక్షకులు.ఇదేంటి అంచనా గురి తప్పింది అని సినీ విమర్శకులు బాధపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే సినిమా చల్లబడిపోయింది.
రికార్డు స్థాయి మూడురోజుల తరువాత, ఇప్పుడు డిజాస్టర్ వైపు పరుగులు పెడుతోంది కబాలి.
తమిళనాట ఏమైనా పుంజుకుంటుందో లేదో తెలియదు కాని, తెలుగులో బయ్యర్లకు నష్టాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.అదే జరిగితే, కొచ్చాడియన్, లింగా చిత్రాల తరువాత వరుసగా మూడో డిజాస్టార్ ఇచ్చినట్టవుతుంది మన ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్.