జియో ఉచిత ఆఫర్ కావాలా ? అయితే ఇది చదివి త్వరపడండి

రిలయన్స్ జియో షాక్స్ మీద షాక్స్ ఇస్తోంది.మొదట ఎవరు ఊహించని విధంగా సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ అంటూ ఒక్కసారి రిఛార్జీ చేసుకుంటే చాలా మూడు నెలలు ఉచితంగా, మొత్తం మీద ఒకే రీఛార్జీపై నాలుగు నెలలు రిఛార్జీ చేసుకున్న మంత్లీ ప్యాక్ ఇస్తామని చెప్పిన జియో .

 Jio Summer Surprise Still Open – Hurry Up-TeluguStop.com

ఆ తరువాత ట్రాయ్ విధించిన ఆంక్షలకి తలొగ్గి జియో సమ్మర్ సర్ ప్రైజ్ ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగత తెలిసిందే.అంతే .ఇక జియో రీఛార్జీపై ఆఫర్ ని ఆపేసిందని, ఇప్పుడు రిఛార్జీ చేసుకుంటే ఎలాంటి ఉచిత ఆఫర్ రాదని భయపడటం మొదలుపెట్టారు జనాలు.కాని వాస్తవం అది కాదు

జియో ప్రైమ్ రీఛార్జీపై ఉచిత ఆఫర్ ని ఆపివేయనున్న మాట ఎంతవరకైతే నిజమో, ఇంకా ఆపలేదనే విషయం కూడా అంతే నిజం.

అవును, మీరు ఈ క్షణం కూడా రీఛార్జీ చేసుకోని మూడు నెలల ఉచిత సర్వీసులు పొందవచ్చు.ఇందులో ఎలాంటి సందేహం కాని భయం కాని పెట్టుకోవద్దు.జియో తన ప్రైమ్ వినియోగదారులకి స్వయంగా ఈ మెసెజ్ పెడుతోంది.ఆఫర్ ఇవ్వడం ఎప్పుడు ఆపేస్తారో జియో ఇంకా ప్రకటించలేదు.

ఇది గుర్తుపెట్టుకోండి

MY JIO యాప్ ఓపెన్ చేయండి.అక్కడే జియో నుంచి ఓ సందేశం కనబడుతుంది.“Jio Summer surprise offer to be withdrawn in next few days.All subscribers who subscribe before discontinuation will remain eligible for the offer” అని Dashboard లో సందేశాన్ని వదిలింది జియో.

అంటే ఈ అవకాశం మరో నాలుగైదు రోజులు ఉండొచ్చు అన్నామాట.మరీ నిరాశలో ఆలోచించినా, ఈరోజైతే ఉచిత ఆఫర్ ని ఖచ్చితంగా అందిస్తున్నారు.కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకండి .వెంటనే అంటే వెంటనే మీ my jio యాప్ లోకి వెళ్ళి ₹303 లేదా ఆపైన ప్యాక్ తో రీఛార్జీ చేసుకోని మూడు నెలల ఉచిత సర్వీసులు పొందండి

ఒకవేళ మీరు ₹30 ఆదా చేయాలనుకుంటే మాత్రం PAYTM నుంచి రీఛార్జీ చేసుకోండి.PAYTMJIO అనే ప్రోమోకోడ్ వాడితే మీకు ₹30 డిస్కౌంటు వచ్చి ₹273 మాత్రమే డిడక్ట్ అవుతుంది.మరి ఇంకా ఇక్కడే ఎందుక ఉన్నారు? మూడు నెలల ఆఫర్ వద్దా? వెళ్ళి వెంటనే రీఛార్జీ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube