కొన్నిరోజుల వరకు జియో సిమ్స్ దొరకవంట .. ఎందుకంటే ?

భారత టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం అయిన జియో ఊహించిన దానికన్నా ఎక్కువే మార్కేట్ ని కొల్లగొడుతోంది.ఇప్పటికే 6 మిలియన్ల మంది జియో ఉచిత సేవలను పొందుతున్నారు.

 Jio Sims Won’t Be Issued For Next Few Days-TeluguStop.com

రిలయన్స్ కి ఇలా ఉచితంగా 4G సేవలు, ఫోన్ కాల్స్ ఇస్తే లాభాలు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీలకు మాత్రం కంటిమీద కునుకు ఉండట్లేదు.అయితే ఓ 4-5 రోజులు మాత్రం ఎంతోకొంత ఊరట లభించనుంది జియో పోటీదారులకి.

ఎందుకంటే కనీసం ఓ 4-5 రోజుల వరకు జియో సిమ్ పంపిణిని తాత్కాలికంగా ఆపివేయనున్నారట.

కారణం ఏంటి అంటే .కొత్తగా పంపిణీ చేసిన జియో సిమ్ అప్లికేషన్స్ అలానే పెండింగ్ లో ఉన్నాయి.లక్షల్లో కనెక్షన్లు ఇంకా యాక్టివేట్ చేయలేదు జియో.

కుప్పకుప్పలుగా వచ్చిన అప్లికేషన్స్ ని ఓ పట్టుపట్టి యాక్టివేట్ చేయాలని రిలయన్స్ కొన్నిరోజులు జియో సిమ్ పంపిణీని ఆపివేస్తోంది.ఇప్పటికే స్టాక్ ఉన్న పంపిణీదారుల వద్ద మాత్రం స్టాక్ దొరుకుతుంది.

సెప్టెంబరు 1వ తేదిన జియో యొక్క కమర్షియల్ భవిష్యత్తు గురించి ముకేష్ అంబాని ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అందుకే సెప్టెంబరు ఒకటిలోపు పెండిగ్ లో ఉన్న కనెక్షన్లను యాక్టివేట్ చేయాలని కంపెనీ భావిస్తోంది.

ఆ పని సమర్థవంతంగా జరగాలంటే, సిమ్స్ విడుదల ఓ 4-5 ఆపివేయడమే ఉత్తమమని రిలయన్స్ భావించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube